ఒకప్పుడు గ్లామరస్ పాత్రలతో ఇటు తెలుగు ప్రేక్షకులను, అటు కోలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన హన్సిక… ఈ మధ్య లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తోంది. ఇటీవల మై నేమ్ ఈజ్ శ్రుతితో ప్రేక్షకుల ముందుకు వచ్చిన హన్సిక… తాజాగా 105 మినిట్స్ అనే ఒక ప్రయోగాత్మక చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇది సింగిల్ క్యారెక్టర్, సింగిల్ టేక్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది. ఈ పాయింట్ చాలా కొత్తగా అనిపించడం, ట్రైలర్ కూడా సినిమాపై మరింత ఆసక్తిని రేపడంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. మరి ఈ సినిమా ఆడియన్స్ ను ఏమాత్రం ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: అందమైన అమ్మాయి జాను(హన్సిక మోత్వానీ)… ఓ ఇంట్లో సింగిల్ గా జీవిస్తూ ఉంటుంది. అయితే ఆమెను ఓ విధమైన శక్తి వెంటాడుతూ ఉంటుంది. అదే శక్తి… జానుని బంధించి… చిత్ర హింసలకు గురి చేస్తూ ఉంటుంది. మరి ఆ శక్తి ఎవరు? ఎందుకు బంధించింది? ఆ నిర్భందం నుంచి జానుకి విముక్తి కలిగిందా? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: సింగిల్ ఆర్టిస్ట్… సింగిల్ టేక్ అనే కాన్సెప్ట్ చాలా కొత్తగా ఉంది. ఇలాంటి ఎక్స్ పరిమెంటల్ మూవీకి కథ… కథనం బలంగా ఉంటే ఆడియన్స్ కూడా ఓ డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ను పొందుతారు. ఇలాంటి కథ… కథనాలతో హాలీవుడ్ మూవీస్ వస్తుంటాయి. కానీ తెలుగులో కూడా ఇలాంటి సినిమాలు తీసి… ప్రేక్షకుల్ని మెప్పించొచ్చని ఈ చిత్ర నిర్మాత, దర్శకులు నిరూపించారు. ఇందులో ఫస్ట్ షాట్లోనే… ఓ దట్టమైన కారు చీకటిలో ఉన్న అడవిలో కారు డ్రైవ్ చేసుకొంటూ వెళ్లే జానుతో ఓ ఇంట్రెస్టింగ్ సీన్‌తో కథ మొదలవుతుంది. దర్శకుడు ఏదో కొత్త పాయింట్‌తో కథను చెప్పబోతున్నాడనే ఫీలింగ్ కలుగుతుంది. ఓ వైవిధ్యమైన సస్పెన్స్ మూవీని చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. హన్సిక తన మార్క్ ఫెర్ఫార్మెన్స్ తో కొన్ని సీన్లను ప్రేక్షకుల్ని కుర్చీలో నుంచి కదలనీయకుండా చేసింది. అయితే ఓ ఇంటి నుంచి తప్పించుకొనే క్రమంలో వచ్చే సీన్లను మరింత ఇన్నోవేటివ్ గా రాసుకుని ఉంటే… మరింత ఆసక్తికరంగా సినిమా ఉండేదనే ఫీలింగ్ కలుగుతుంది.
సినిమాలో హన్సిక ఒక్క క్యారెక్టర్ ఉండటంతో సినిమా భారాన్నంత ఆమెనే మోసిందనే చెప్పాలి. సింగిల్ టేక్ కావడంతో సింగిల్ ఎమోషన్ మీదనే సినిమా మొత్తం సాగింది. అయితే సింగిల్ ఎమోషన్‌తోనే హన్సిక మెప్పించే ప్రయత్నం చేసింది. కథలో పాయింట్ వల్ల ఆమె ఫెర్ఫార్మెన్స్ పరిమితి ఏర్పడిందని చెప్పవచ్చు. సాంకేతిక విభాగాల పనితీరు విషయానికి వస్తే.. సినిమాటోగ్రఫి, మ్యూజిక్ సినిమాకు మంచి సపోర్ట్‌గా మారాయి. సస్పెన్స్, థ్రిల్లర్‌గా మారే ఈ సినిమాకు సామ్ సీఎస్ మ్యూజిక్ బాగుంది. రీరికార్డింగ్ చాలా సీన్లను ఎలివేట్ చేశారని చెప్పవచ్చు. కిషోర్ బోయిడపు సినిమాటోగ్రఫి బాగుంది. లైటింగ్, కలర్ ప్యాటర్న్ సినిమాకు మంచి ఫీల్ కలిగించేలా ఉన్నాయి. ఒకే ఒక క్యారెక్టర్ చుట్టూ కొన్ని ఎమోషన్స్ తో అల్లుకొన్న కథ ఇది. ఈ పూర్తిగా ప్రయోగమనే చెప్పాలి. ఈ ప్రయోగంలో కథ, కథనాలు కాస్త రెగ్యులర్‌గా, రొటీన్‌గా ఉన్నా… ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి. ఈ సినిమాకు మ్యూజిక్, సినిమాటోగ్రఫి, ప్రొడక్షన్ వ్యాల్యూస్ సూపర్బ్ గా ఉన్నాయి. హన్సిక తన పాత్ర పరిధి మేరకు న్యాయం చేసింది. నిర్మాత బొమ్మక శివ… ఎక్కడా ఖర్చుకు వెనుకాడకుండా సినిమాను తెరకెక్కించారు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్..!!!
రేటింగ్: 2.75