విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా మధుర ఎంటర్ టైన్ మెంట్, నిర్వీ ఆర్ట్స్ బ్యానర్స్ పై… మధుర శ్రీధర్ రెడ్డి, నిర్వి హరి ప్రసాద్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించిన చిత్రం “సంతాన ప్రాప్తిరస్తు”. సంజీవ్ రెడ్డి దర్శకత్వం వహించారు. IVF మీద ఓ కొత్త కాన్సెప్ట్ తో సినిమాని తెరకెక్కించినట్లు చెబుతూ వచ్చిన చిత్ర బృందం… ఈ రోజే సినిమాని ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. మరి ఈ సినిమా ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: చైతన్య అలియాస్ చైతూ (విక్రాంత్) సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. అతను తొలిచూపులోనే కల్యాణి (చాందినీ చౌదరి) ప్రేమలో పడతాడు. అయితే వీళ్ల వివాహానికి కల్యాణి తండ్రి ఈశ్వరరావు (మురళీధర్ గౌడ్) ఒప్పుకోడు. అయితే పెళ్లై పిల్లల్ని కంటే అతనే ఒప్పుకుంటాడని ఇంట్లో నుంచి వెళ్లిపోయి చైతూని పెళ్లాడుతుంది కల్యాణి. అయితే చైతూకి స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉండటంతో పిల్లలు పుట్టే ఛాన్స్ తక్కువని డాక్టర్లు చెప్తారు. ఈ క్రమంలో ఈశ్వరరావు.. కూతురి చేసిన తప్పుని క్షమించి అల్లుడు ఇంట్లో మకాం పెడతాడు. మరి చైతూ, కల్యాణిలకు సంతానం కలిగిందా? తన మామ రాకతో చైతూ ఇంట్లో జరిగిన పరిణామాలు ఏంటి? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే..!!!
విశ్లేషణ: ప్రస్తుత సమాజంలో యువత ఎదుర్కొంటున్న ఇన్ ఫెర్టిలిటీ ఎలిమెంట్‌కి ఫన్ అండ్ ఎమోషన్‌ని జోడించి.. ‘సంతాన ప్రాప్తిరస్తు’కి గల అవరోధాలను ఎలా జయించవచ్చో చూపించారు దర్శకుడు సంజీవరెడ్డి. సొసైటీలో ఉన్న ఇన్ ఫెర్టిలిటీ అనే సీరియస్ సబ్జెక్ట్‌ని సున్నితమైన కథతో ఆడియన్స్‌ని కనెక్ట్ చేసే ప్రయత్నం చేశారు.
ముఖ్యంగా సాఫ్ట్ వేర్ ఉద్యోగాల్లో ఉండేవాళ్లు.. నెలంతా పని చేసి.. వచ్చిన జీతంలో ఎక్కువ మొత్తం ఎంజాయ్‌మెంట్‌కే కేటాయిస్తుంటారు. మందు, సిగరెట్ ఇతర వ్యసనాలకు బానిసలై తమకి తెలియకుండానే ఎలాంటి ఇబ్బందుల్ని కొనితెచ్చుకుంటున్నారనే సీరియస్ ఇష్యూని ఫన్ మోడ్‌లో చూపించారు. మందు, సిగరెట్‌లతో పాటు.. వర్క్ టెన్షన్, నిద్రలేమి వంటి సమస్యలు పర్సనల్ లైఫ్ మీద…ముఖ్యంగా సంతానలేమికి ఏవిధంగా కారణం అవుతున్నాయనే అంశాలను ఓ మెసేజ్ రూపంలో చూపించారు.
సంతానలేమి అనే సున్నిత సమస్య వల్ల ఎలా నలిగిపోతారు? అది వాళ్ల వ్యక్తిగత జీవితంపైనే కాకుండా.. ప్రొఫెషన్‌పై కూడా ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? దాని వల్ల సమాజంలో ఎలాంటి అవమానాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అనే అంశాలను ఎమోషనల్‌గా చూపించారు. సంతానం కోసం ఐవీఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్లకు వెళ్లడం.. అక్కడ వాళ్లకి ఎదురయ్యే పరిస్థితులు, టెస్ట్‌ల పేరుతో దోపిడీలను సెటారికల్‌గానే చూపిస్తూ.. సీరియస్ ఇష్యూని చర్చించి … ప్రతి దానికి పరిష్కారం ఉంటుందని హింట్ ఇచ్చే ప్రయత్నం చేసారు.
విక్రాంత్ తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. స్క్రీన్ మీద మెచ్యూర్డ్ గా నటించాడు. సాఫ్ట్వేర్ వేర్ ఉద్యోగిగా పాత్రలో బాగా ఒదిగిపోయాడు. చాందిని చౌదరి పాతిక కూడా బాగుంది. వెన్నెల కిషోర్, అభినవ్ గోమఠం, తరుణ్ భాస్కర్ కారణంగా కొన్ని సన్నివేశాలు బాగానే పనిచేశాయి. వాళ్ల క్యారెక్టర్స్ బాగా పేలాయి.. నటన కూడా బాగుంది. మురళీధర్ గౌడ్ కఠినమైన తండ్రిగా… మరోవైపు ఎమోషనల్ గా నటించి మెప్పించాడు. మిగతా పాత్రలన్నీ తమ తమ పరిధి మేరకు నటించి మెప్పించారు.
సునీల్ కశ్యప్ సంగీతం బాగుంది. ఎడిటింగ్ ఫస్టాఫ్ కాస్త షార్ప్ కట్స్ ఉంటే బాగుండేవి. సినిమాటోగ్రఫీ పర్లేదు. కథ వరకు చాలా బాగుంది. దానికి ఫన్నీ వే లో స్క్రీన్ ప్లే నడిపించారు. . నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడిగా సంజయ్ రెడ్డి సక్సెస్ అయ్యాడనే చెప్పొచ్చు. వీకెండ్ లో సరదాగా ఓ సారి చూసేయండి.
రేటింగ్: 3










