మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’(The Red Bag). డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా సాగే ఈ మూవీని రవి కుమార్ సీరపు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ సినిమాలో కబీర్ సింగ్ దుల్హన్ (Kabir Singh Dulhan), ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, స్నేహ సింగ్, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశి(Raashi) కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పీవీఆర్(PVR) ఐనాక్స్(Inox) పిక్చర్స్ లో ఈరోజే ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. మరి ఈ సినిమా ఏమాత్రం థ్రిల్ కు గురిచేసిందో చూద్దాం పదండి.
కథ: ఆరిజోనాలోని ఓ పబ్ లో విన్ని (రాధ్య) డ్యాన్సర్ గా చేస్తుంటుంది. ఆ పబ్ ఓనర్ మైక్ (కబీర్ సింగ్) అతి క్రూరుడు. మైక్ కి ఓ ఐలాండ్ లో భారీ రిసార్ట్ ను … పబ్ ను పెట్టాలనే ధ్యేయంతో ఉంటాడు. అందుకోసమే పబ్ లో అమ్మాయిల్ని పెట్టి వ్యాపారం నిర్వహిస్తుంటాడు. అలాంటి చీకటి లోకంలోకి ఈషా, ఈవ్, బేబ్ అని ముగ్గురు ఇండియన్స్ వచ్చి చేరతారు. అసలు విన్ని ఈ పనిలోకి ఎలా వచ్చింది? ఆ ముగ్గురు అసలు ఇండియా నుంచి ఆరిజానాకి ఎందుకు వస్తారు? మైక్ చేతిలో చిక్కిన వీరంతా బయటకు ఎలా వెళ్తారు? ఈ క్రమంలో రెడ్ బ్యాగ్ వల్ల కలిగిన లాభనష్టాలు ఏంటి? అసలు ఆ రెడ్ బ్యాగ్ లో ఏముంది? చివరకు ఈ నలుగురు అమ్మాయిలు తమ తమ లక్ష్యాల్ని చేరుకున్నారా? లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: ఈ సినిమా ప్రారంభం కాస్త నెమ్మదిగా ఉంటుంది. విన్ని పాత్ర పరిచయం, రాశీ కారెక్టర్ లో ఓపెన్ చేయించడం.. మెల్లిగా కథ ఫ్లాష్ బ్యాక్ కి వెళ్లడం, పబ్ వాతావరణం.. అక్కడి ఇల్లీగల్ పనులు ఇవన్నీ కూడా ఆసక్తికరంగా సాగుతుంటాయి. ముగ్గురు అమ్మాయిల పాత్రలు ఎంట్రీ ఇవ్వడం, వారి ఫ్లాష్ బ్యాక్ మాత్రం చాలా ఎమోషనల్ గా ఉండటంతో కథ ఒక్కసారిగా మలుపు తిరుగుతుంది. ఈ కథకి బ్యాక్ అండ్ ఫోర్త్ స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. ఇంటర్వెల్ లో బిగ్ ట్విస్ట్ ఆడియన్స్ లో ఆసక్తి పెంచుతుంది.
సెకండాఫ్ లో విన్ని పాత్ర, గౌతమ్ కారెక్టర్ల ఫ్లాష్ బ్యాక్ సాదాసీదాగా సాగుతుంది. ప్రసాద్ బెహరా, కబీర్ సింగ్ ద్వయం సీన్లు కొన్ని నవ్వులు పూయిస్తాయి. సెకండాఫ్ లో ఛేజింగ్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్ ఫర్వాలేదనిపిస్తాయి. క్లైమాక్స్ కి వచ్చే సరికి మంచి ఎమోషనల్ టచ్ బాగుంది. వేరే దారిలేక తప్పుడు దారిని ఎంచుకున్న తల్లి, ఆ తల్లిని సమాజం చూసే చిన్న చూపు ఇలాంటి అంశాల్ని దర్శకుడు ఎంతో సున్నితంగా చూపించాడు. హీరోయిన్లు తెరపై కాస్త బోల్డ్ గా కనిపించినా.. ప్రవర్తించినా.. వారి లక్ష్యం, ధ్యేయం మాత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. చివరకు నలుగురు ధీర వనితలు చేసిన యుద్ధం, రాబిన్ హుడ్ లో అందరికి చేసిన సాయం మెప్పిస్తుంది.
ఎవరెలా చేశారంటే..
విన్ని పాత్రలో రాధ్య అందరినీ ఆకట్టుకుంటుంది. మిగతా ముగ్గురు హీరోయిన్లు తెరపై అందంగా కనిపిస్తారు. మోడ్రన్ గా కనిపించే లుక్ లోనూ, ఎమోషన్స్ చూపించే సీన్లలోనూ నలుగురు భామలు ఆడియన్స్ ను మెప్పిస్తారు. కబీర్ సింగ్ విలనిజం ఓకే అనిపిస్తుంది. ప్రసాద్ బెహరా సీన్లు నవ్వులు పుట్టిస్తాయి. గాయత్రి భార్గవి, రాశీ, జాక్, దగ్లస్, గౌతమ్ తమ పాత్రల పరిధిలో మెప్పించారు.
సాంకేతిక నిపుణుల పనితీరు
సాంకేతికత పరంగా చూస్తే ది రెడ్ బ్యాగ్ మూవీ వైవిధ్యమైన కథ… కథనాలతో ఆడియన్స్ ను సస్పెన్స్ తో థ్రిల్ కు గురిచేసేలా చేయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. అలాగే సినిమాను వెండితెరపై స్టైలిష్ గా చిత్రీకరించడంలో సినిమాటోగ్రఫీ బాగుంది. చాలా సీన్లలో బీజీఎం అదిరిపోయింది. ఎడిటింగ్ మరింత గ్రిప్పింగ్ గా ఉంది. నిర్మాణ విలువలు కథకు తగ్గట్టుగా ఉన్నతంగా ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్..!!!
రేటింగ్: 3









