హ్యపీడేస్ సినిమాతో లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న వరుణ్ సందేశ్… తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వరుస సినిమాలతో ఆడియన్స్ ను అలరిస్తూనే వున్నారు ఈ యువ హీరో. తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ క్రైం ఇన్వెస్టిగేటింగ్ స్టోరీతో ‘కానిస్టేబుల్’గా మన ముందుకు వచ్చారు. నిర్మాత బలగం జగదీష్ ఈ చిత్రాన్ని నిర్మించగా… ఆర్యన్ సుభాన్ ఎస్.కె.దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. వరుణ్ సందేశ్ సరసన మధులిక వారణాసి నటించగా… భవ్యశ్రీ, నిత్యశ్రీ, దువ్వాసి మోహన్ తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈవారం విడులైన సినిమాల్లో ఈ సినిమానే ఎంతో పాజిటివ్ వైబ్ తో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలావుందో రివ్యూలో తెలుసుకుందాం పదండి.
కథ: హైదరాబాద్ నగర శివారులో వున్న మోకిలా మండల పరిధిలోని శంకరపల్లి అనే చిన్న గ్రామంలో వరుస హత్యలు జరుగుతూ ప్రజలను బెంబేలెత్తిస్తుంటాయి. లింగ బేధం లేకుండా అతి కిరాతకంగా ఈ హత్యలను చేస్తుంటారు. దీని వెనుక వున్న హంతకులు ఎవరనేది గ్రామ ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. ఇది పోలీసులకు కూడా సవాలుగా మారుతుంది. ఈ క్రమంలోనే అదే ఊరిలో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కాశీ(వరుణ్ సందేశ్) మేనకోడలు కీర్తి(నిత్యశ్రీ)ని చంపే దాకా వస్తుంది. దాంతో కానిస్టేబుల్ కాశీ అలర్ట్ అవుతాడు. ఈ హత్యల వెనుక ఎవరున్నారనే దానిపై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తాడు. ఈ క్రమంలో అతనికి ఊహించని ట్విస్టులు ఎదురవుతాయి. హంతకులు అని అనుమానించిన వారు కూడా చంపబడటంతో మరింత అయోమయానికి గురవుతాడు కానిస్టేబుల్. మరి కానిస్టేబుల్ అసలు హంతకులను పట్టుకోవడానికి ఎలాంటి ఎన్వెస్టిగేషన్ చేశారు? అసలు హంతకులను ఎలా పట్టుకున్నాడు? వాళ్లు ఈ హత్యలు ఎందుకు చేస్తున్నారు? దాని వెనుకున్న కారణాలు ఏంటి? ఈ వరుస హత్యల వెనుకున్న పాత్రధారులను కానిస్టేబుల్ పట్టుకున్నాడా? లేదా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ: క్రైం థ్రిల్లర్ మూవీస్ కి మంచి ఆదరణ వుంది. పర్ ఫెక్ట్ స్టోరీ లైన్… ఎంగేజింగ్ స్క్రీన్ ప్లేతో క్రైం థ్రిల్లర్ మూవీస్ ను తెరకెక్కిస్తే… ప్రేక్షకులు ఇట్టే కనెక్ట్ అయిపోతారు. గ్రిప్పింగ్ గా మూవీని సెల్యూలాయిడ్ మీద ఆవిష్కరించి చాలా మంది దర్శకులు, నిర్మాతలు సక్సెస్ అయ్యారు. తాజాగా యంగ్ హీరో వరుణ్ సందేశ్ తో తెరకెక్కించిన ఇన్వెస్టిగేటివ్ క్రైం థ్రిల్లర్ మూవీ కూడా చాలా వైవిధ్యమైన కథ… కథనాలతో తెరకెక్కిందే. గతంలో ఇలాంటి ట్విస్టులున్న క్రైం థ్రిల్లర్ మూవీని వెండితెరపై చూసుండకపోవచ్చు. చివరి దాకా సస్పెన్షన్ ఫ్యాక్టర్ ను రివీల్ చేయకుండా ఆడియన్స్ ను సీట్ ఎడ్జ్ లో కూర్చుండబెట్టారు. ఇంటర్వెల్‌కి వచ్చే ట్విస్ట్ ఆడియన్స్ లో సెకెండాఫ్ పై మరింత ఆసక్తిని పెంచుతుంది. ఆ తరువాత సెకండాఫ్ అంతా కూడా కేసుని ఛేదించే క్రమంలో కాశీ చేసే ప్రయత్నాలన్నీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. ఈ క్రమంలోనే అసలు దోషి ఎవరనేది రివీల్ చేసి ప్రేక్షకులు ఆశ్యర్యానికి గురయ్యేలా చేశాడు దర్శకుడు. గో అండ్ వాచ్ ఇట్.
ఇప్పటి దాకా లవర్ బోయ్గా… పక్కింటి కుర్రాడిగా కనిపించిన వరుణ్ సందేశ్… ఇందులో కానిస్టేబుల్‌గా కాశీ పాత్రలో కొత్తగా కనిపిస్తాడు. వరుణ్ సందేశ్ లుక్స్, యాక్టింగ్ అన్నీ కొత్తగా కనిపిస్తాయి. బాగుంటాయి. హీరోయిన్‌గా మధులిక వారణాసి పాత్ర కూడా బాగుంది. ఇక భవ్య శ్రీ, నిత్య శ్రీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. మిగిలిన పాత్రల్లో అందరూ వారి పాత్రలకు న్యాయం చేశారనే చెప్పొచ్చు.
ఇలాంటి చిత్రాలకు సాంకేతిక బృందం సరిగ్గా సపోర్ట్ చేస్తే రిజల్ట్ నెక్ట్స్ లెవెల్లో ఉంటుంది. కానిస్టేబుల్ కోసం చేసిన నేపథ్య సంగీతం సినిమాకి ప్రాణం పోసింది. సినిమాటోగ్రఫీ కూడా రిచ్ గా వుంది. ఎడిటింగ్ చాలా గ్రిప్పింగ్ వుంది. నిర్మాత బలగం జగదీష్ ఎక్కడా రాజీ పడకుండా సినిమాను నిర్మించారు. చిత్ర నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా వున్నాయి. ఈ వారం ఈ ఇంట్రెస్టింగ్ క్రైం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ ను ఓ సారి చూసేయండి.
రేటింగ్: 3/5









