• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Friday, September 4, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..

Maari by Maari
September 4, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..

Share and Enjoy !

Shares
Twitter

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం.. ‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’

▪️ అక్టోబర్ 1 నుంచి 5 వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఐదు రోజుల పాటు సభలు
▪️ ధ్యానం, అహింస, శాకాహారంపై విస్తృత అవగాహన కల్పించేందుకు మహాసభలు
▪️ వివరాలు వెల్లడిస్తూ నిర్వాహకుల ప్రెస్ మీట్
▪️ రోజా రమణి, ఫైట్ మాస్టర్స్ రామ్-లక్ష్మణ్ హాజరు

హైదరాబాద్: అహింసా భావనను సమాజంలో విస్తృతంగా పెంపొందించడంతో పాటు జీవుల పట్ల కరుణ, దయ, శాకాహారం, ధ్యానం ప్రాధాన్యతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’ నిర్వహిస్తున్నట్లు నేషనల్ వెజిటేరియన్ మూవ్‌మెంట్ ఫౌండర్ ఆచార్య శ్రీనివాస్ తెలిపారు. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్, నేషనల్ వెజిటేరియన్ మూవ్‌మెంట్ సంయుక్త ఆధ్వర్యంలో అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఐదు రోజుల పాటు ఈ మహాసభలు జరగనున్నాయి.

ఈ మహాసభలకు సంబంధించిన ముందస్తు మీడియా సమావేశం హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో నిర్వహించారు. ప్రముఖ సీనియర్ నటి రోజా రమణి, సినీ రంగానికి చెందిన ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

నేషనల్ వెజిటేరియన్ మూవ్‌మెంట్ ఫౌండర్ ఆచార్య శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’ లోగో, బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ప్రముఖ నటుడు ఉపేంద్ర, బాబా రాందేవ్, మేనకా గాంధీ తదితర ప్రముఖులు ఇటీవల లోగో ఆవిష్కరించిన దృశ్యాలను ఈ సమావేశంలో ప్రదర్శించారు.

‘అహింసా కుంభమేళా’గా నిర్వహిస్తున్నాం
ఆచార్య శ్రీనివాస్ మాట్లాడుతూ.. హింస జరగకూడదనే, జంతువులను చంపకూడదనే భావనతో హైదరాబాద్‌లో ‘అహింసా కుంభమేళా’ను నిర్వహిస్తున్నామని తెలిపారు. మాంసాహారం మానవ జాతికి పట్టిన పీడగా ఆయన అభివర్ణించారు. మానవాళిలో అహింస, శాకాహారంపై విస్తృత ప్రచారం చేయడంతో పాటు జీవుల పట్ల దయ, కరుణను పెంపొందించడం ఈ మహాసభల ప్రధాన ఉద్దేశమన్నారు.

ధ్యానం, అహింస, శాకాహారం ద్వారా ఆరోగ్యకరమైన, ప్రశాంతమైన జీవన విధానాన్ని ప్రజల్లో ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సమాజంలో అహింసా భావనను మరింత బలోపేతం చేయడంతో పాటు శాకాహారం ప్రాధాన్యతను ప్రజలకు వివరించనున్నట్లు తెలిపారు. ఈ మహాసభలకు ప్రముఖ నటుడు ఉపేంద్ర, బాబా రాందేవ్, మేనకా గాంధీ తదితర ప్రముఖులు హాజరు కానున్నట్లు ఆచార్య శ్రీనివాస్ వెల్లడించారు.

‘శ్రీనివాస్ దంపతులు వండర్ కపుల్’
ప్రముఖ సీనియర్ నటి రోజా రమణి మాట్లాడుతూ.. ఆచార్య శ్రీనివాస్‌తో పరిచయం ఏర్పడిన తర్వాత పత్రీజీ నిర్వహించిన సభలకు తాను వెళ్లానని, ఆ కార్యక్రమాలకు భారీగా ప్రజలు హాజరయ్యేవారని గుర్తుచేశారు. ఆచార్య శ్రీనివాస్, ఆయన సతీమణి కలిసి ఈ ఉద్యమాన్ని ఉధృతంగా ముందుకు తీసుకెళ్తున్నారని ప్రశంసించారు.

ఈ దంపతులను తాను ‘వండర్ కపుల్’ అని పిలుస్తానని రోజా రమణి అన్నారు. ఆచార్య శ్రీనివాస్ సంకల్పం ఎంతో గొప్పదని, మూగజీవుల ఆశీస్సులు ఆయన దంపతులపై ఉన్నాయని పేర్కొన్నారు. అందుకే ప్రజలు ఈ ఉద్యమానికి ఇంత అద్భుతంగా స్పందిస్తూ సభలకు హాజరవుతున్నారని చెప్పారు. ధ్యానం, శాకాహారం మనిషి శారీరక, మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని ఆమె తెలిపారు. ప్రతి ఒక్కరూ జీవుల పట్ల కరుణ, దయ కలిగి ఉండాలని, అహింసను జీవన విధానంగా అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. సోషల్ మీడియాను ఉపయోగించుకుని ప్రతి ఒక్కరూ అహింస, శాకాహారం, జీవకరుణ వంటి అంశాలను విస్తృతంగా ప్రచారం చేయాలని రోజా రమణి కోరారు. అక్టోబర్ 1 నుంచి 5 వరకు జరిగే ఐదు రోజుల మహాసభలకు ప్రతి ఒక్కరూ హాజరై విజయవంతం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

ఆరోగ్యకరమైన జీవనశైలికి ధ్యానం, శాకాహారం

ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఆచార్య శ్రీనివాస్ ప్రారంభించిన ఈ సంకల్పం ఎంతో గొప్పదని, దీనికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని అన్నారు. ప్రస్తుత కాలంలో షుగర్, బీపీ వంటి అనేక రకాల ఆరోగ్య సమస్యలు సాధారణమైపోతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి ఆరోగ్య సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ఈ కార్యక్రమం ఒక మంచి యజ్ఞం వంటిదని తెలిపారు. ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు మానసిక ప్రశాంతత కోసం ధ్యానం, శాకాహారం ఎంతో ఉపయోగకరమని చెప్పారు. సమాజంలో అహింస, జీవకరుణ, శాకాహారంపై మరింత అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. ఐదు రోజుల పాటు జరిగే మహాసభలకు ప్రజలంతా హాజరు కావాలని పిలుపునిచ్చారు.

ఈ ప్రెస్‌మీట్‌లో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్‌మెంట్, నేషనల్ వెజిటేరియన్ మూవ్‌మెంట్ ప్రతినిధులు, సభ్యులు, నిర్వాహకులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు. రాబోయే ‘జాతీయ అహింసా ధ్యాన మహాసభలు’ను విజయవంతం చేసేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

అక్టోబర్ 1 నుంచి 5వ తేదీ వరకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో ఐదు రోజుల పాటు జరిగే ఈ మహాసభల్లో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అహింస, జీవకరుణ, ధ్యానం, శాకాహారం సందేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని నిర్వాహకులు కోరారు.

ఈ కార్యక్రమంలో నేషనల్ వెజిటేరియన్ మూవ్‌మెంట్ ఫౌండర్ ఆచార్య శ్రీనివాస్‌తో పాటు సురేందర్ బండారి, సంబశివ రావు, సునీత, గీత యాదవ్, సంగీత బాబు తదితరులు పాల్గొన్నారు.

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

రివ్యూ: ఎంగేజింగ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా… ధర్మస్థల నియోజకవర్గం(Dharmasthala Niyojakavargam Review)

Next Post

సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న ZEE5 ఒరిజినల్ సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’ ఫస్ట్ సీజన్ పార్ట్‌1..

Next Post
సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న ZEE5 ఒరిజినల్ సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’ ఫస్ట్ సీజన్ పార్ట్‌1..

సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న ZEE5 ఒరిజినల్ సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’ ఫస్ట్ సీజన్ పార్ట్‌1..

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఆ రెండు ప్యానెల్స్ చేయలేని పనులను నేను చేసి చూపిస్తా – లేకుంటే రాజీనామా చేస్తా: నట్టి కుమార్

ఆ రెండు ప్యానెల్స్ చేయలేని పనులను నేను చేసి చూపిస్తా – లేకుంటే రాజీనామా చేస్తా: నట్టి కుమార్

by Maari
September 4, 2026
0

యూనిక్ థ్రిల్లర్ “టార్టాయిస్” నుంచి ‘నీ పరిచయం…’ సాంగ్ లాంఛ్

యూనిక్ థ్రిల్లర్ “టార్టాయిస్” నుంచి ‘నీ పరిచయం…’ సాంగ్ లాంఛ్

by Maari
September 4, 2026
0

సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న ZEE5 ఒరిజినల్ సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’ ఫస్ట్ సీజన్ పార్ట్‌1..

సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న ZEE5 ఒరిజినల్ సిరీస్ ‘వీరభద్రుని రహస్యం’ ఫస్ట్ సీజన్ పార్ట్‌1..

by Maari
September 4, 2026
0

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..

అహింసా భావనను విస్తృతం చేయడమే లక్ష్యం..

by Maari
September 4, 2026
0

రివ్యూ: ఎంగేజింగ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా… ధర్మస్థల నియోజకవర్గం(Dharmasthala Niyojakavargam Review)

రివ్యూ: ఎంగేజింగ్ పొలిటికల్ యాక్షన్ డ్రామా… ధర్మస్థల నియోజకవర్గం(Dharmasthala Niyojakavargam Review)

by Maari
September 4, 2026
0

‘గజ’ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను..  ‘అల్లకల్లోలంగా’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్

‘గజ’ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.. ‘అల్లకల్లోలంగా’ సాంగ్ లాంచ్ ఈవెంట్‌లో ప్రముఖ దర్శకుడు సాయి రాజేష్

by Maari
September 3, 2026
0

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

ఘనంగా “జయహో రామానుజ” సినిమా సాంగ్ లాంఛ్ ఈవెంట్

by Maari
September 3, 2026
0

మూవీ రివ్యూ: ‘రోమాంచకం’(Romanchakam Review): ప్రేమ, హాస్యం, సస్పెన్స్‌తో యూత్‌ను ఆకట్టుకునే ఫన్‌ఫుల్ ఎంటర్‌టైనర్!

మూవీ రివ్యూ: ‘రోమాంచకం’(Romanchakam Review): ప్రేమ, హాస్యం, సస్పెన్స్‌తో యూత్‌ను ఆకట్టుకునే ఫన్‌ఫుల్ ఎంటర్‌టైనర్!

by Maari
September 3, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.