నటీనటులు: కిరణ్ అబ్బవరం, రుక్సార్ థిల్లాన్, క్యాతీ డేవిసన్, జాన్ విజయ్, కిల్లి క్రాంతి.. తదితరులు..
సంగీతం: సామ్ CS
ఛాయాగ్రహణం: విశ్వాస్ డేనియల్
నిర్మాణం: శివమ్ సెల్యులాయిడ్స్, ఏ యూడ్లీ ఫిలిం బ్యానర్స్
నిర్మాతలు : రవి, జోజో జోస్, రాకేష్ రెడ్డి, సారెగమ
రచన-దర్శకత్వం: విశ్వ కరుణ్
యువ హీరో కిరణ్ అబ్బవరం ఇటీవలే ‘క’ అనే సినిమాతో వచ్చి సూపర్ హిట్ కొట్టాడు. ఆ సక్సెస్ తో ఫుల్ ఫామ్ లో ఉన్న కిరణ్ హోలీ నాడు మార్చ్ 14న దిల్ రూబా సినిమాతో థియేటర్స్ లోకి వచ్చాడు.
కథ : చిన్నప్పట్నుంచి ప్రేమించిన మ్యాగీ(క్యాతీ డేవిసన్) విడిపోవడం, తండ్రి చనిపోవడంతో సిద్దార్థ్ కాస్త మార్పు రావాలని మంగుళూరు వెళ్లి చదువుకుంటాడు. అక్కడ అంజలి(రుక్సార్ థిల్లాన్)తో ప్రేమలో పడతాడు సిద్దార్థ్. ఆమె వల్ల విక్కీ(కిల్లి క్రాంతి)తో గొడవలు అవుతాయి. ఆ గొడవలు పోలీస్ స్టేషన్ దాకా వెళ్లడం, అసలు సారీ, థ్యాంక్స్ లు చెప్పని సిద్దార్థ్ సారీ చెప్పను అనడంతో అనుకోకుండా అంజలి – సిద్దార్థ్ కూడా విడిపోతారు. మ్యాగీ మళ్ళీ పెళ్లి చేసుకొని ప్రగ్నెంట్ అయి సిద్దార్థ్ లైఫ్ లోకి వస్తుంది. సిద్దార్థ్ – మ్యాగీ ఎందుకు విడిపోయారు? మ్యాగీ ఎందుకు మళ్ళీ వచ్చింది? సిద్దార్థ్ – అంజలి ఎందుకు విడిపోయారు? మళ్ళీ కలిసారా? విక్కీతో ఉన్న గొడవలు ఏంటి? సిద్దార్థ్ సారీ, థ్యాంక్స్ లు ఎందుకు చెప్పడు? అసలు చెప్తాడా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథనం – విశ్లేషణ : ప్రేమకథలు రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి. ఇటీవల గతంలో విడిపోయిన గర్ల్ ఫ్రెండ్ ఎక్స్ రూపంలో మళ్ళీ లైఫ్ లోకి వస్తే ఏం జరుగుతుంది అని సంక్రాంతికి వస్తున్నాం, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ సినిమాల్లో చూసాం. ఇందులో కూడా ఆ పాయింట్ ఉండటం గమనార్హం. అయితే ఎక్స్ తిరిగి రావడం అనే పాయింట్ ఉన్నా సినిమా హీరో క్యారెక్టరైజేషన్ తో నడుస్తుంది. రెండు లవ్ స్టోరీలు ఉన్నా హీరో క్యారెక్టర్ చుట్టూ రాసుకున్నట్టు ఉంటాయి.
ఫస్ట్ హాఫ్ లో హీరో మొదటి ప్రేమకథ గురించి చెప్పేసి, రెండో ప్రేమకథతో సాగదీస్తారు. విక్కీ పాత్రతో హీరో గొడవలు అనే ఎమోషన్ మాత్రం బాగానే రాసుకున్నారు. హీరో ఫ్లాష్ బ్యాక్ సింపుల్ గా, సిల్లీగా అయిపోయింది అనిపిస్తుంది. రుక్సార్ పాత్ర, ఆమె హీరో వెనక పడే క్యారెక్టర్, ఆ సీన్స్ అన్ని ఏంట్రా బాబు ఇది అనిపించేలా సాగదీశారు. ప్రీ ఇంటర్వెల్ లో మంచి యాక్షన్ సీక్వెన్స్ చూపెట్టి ఇంటర్వెల్ కి సడెన్ గా అంజలి – సిద్దార్థ్ బ్రేకప్ ఇచ్చి నెక్స్ట్ ఏంటి అని అనిపించేలా చేసారు. సెకండ్ హాఫ్ మాత్రం మళ్ళీ వెళ్లిపోయిన మ్యాగీ తిరిగిరావడం, హీరోయిన్ కోసం హీరో వెనకపడే సీన్స్ కాస్త రొటీన్ గానే ఉంటాయి, ఈ మధ్యలో ఒక విలన్, వాడి డెన్ సెటప్, వాడికి – హీరోకి మధ్య గొడవ రెగ్యులర్ స్టోరిల్లా అనిపిస్తాయి.
ఎక్స్ హీరో దగ్గరికి ప్రగ్నెంట్ గా రావడం, ఆమె భర్త అమెరికా నుంచి పంపడం, ఆమె సిద్దార్థ్ తో కలిసి మంగుళూరు లో ఒకే రూమ్ లో ఉండటం, ఆమె అంజలి – సిద్దార్థ్ లను కలపడానికి అమెరికా నుంచి రావడం ఇవన్నీ సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ఇష్టమొచ్చినట్టు సీన్స్ రాసుకున్నారు అనిపిస్తుంది. హీరో క్యారెక్టరైజేషన్ మాత్రం పూరి సినిమాలు గుర్తుకు వస్తాయి. చాలా డైలాగ్స్ త్రివిక్రమ్ ని గుర్తు చేస్తాయి. ప్రమోషన్స్ లో నిర్మాత రవి సినిమాలో యాక్షన్ సీన్స్ నచ్చకపోతే నన్ను కొట్టండి అన్నారు. ఆ మాటకు తగ్గట్టు యాక్షన్ సీన్స్ మాత్రం కొత్తగా మంచి ఎమోషన్ తో పవర్ ఫుల్ గా డిజైన్ చేసారు.
నటీనటులు : సినిమా సినిమాకి తన నటనని డెవలప్ చేసుకుంటున్న కిరణ్ అబ్బవరం ఇందులో కాస్త డిఫరెంట్ గా ఫుల్ సీరియస్ పాత్రలో కనిపించి మెప్పించాడు. రుక్సార్ థిల్లాన్ మాత్రం మొదట్లో ఇరిటేట్ చేసినా ఆ తర్వాత పర్వాలేదనిపిస్తుంది. క్యాతీ డేవిసన్ ప్రగ్నెంట్ పాత్రలో పర్ఫెక్ట్ గా సెట్ అయి చాలా సహజంగా నటించింది. విక్కీ పాత్రలో కిల్లి క్రాంతి నెగిటివ్ షేడ్స్ లో పాత్రలో ఒదిగిపోయాడు. జాన్ విజయ్ పాత్ర కూడా నెగిటివ్ షేడ్స్ లో కాస్త ఓవర్ యాక్టింగ్ అనిపిస్తుంది. కమెడియన్ సత్య ఉన్నా సరిగ్గా వాడుకోలేదు అనిపిస్తుంది. తులసి, సమీర్, ఆడుకాలం నరేన్.. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో మెప్పించారు.
సాంకేతిక వర్గం : విశ్వాస్ డానియల్ సినిమాటోగ్రఫీ విజువల్స్ బానే ఉన్నా కొన్ని సీన్స్ లో మాత్రం ఓకే అనిపిస్తాయి. సామ్ CS ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ బాగున్నా పాటలు మాత్రం యావరేజ్. దర్శకుడు విశ్వ కరుణ్ కథ మీద ఎక్కువ దృష్టి పెట్టకుండా హీరో క్యారెక్టరైజేషన్ మీద ఫోకస్ చేయడంతో అది బాగానే వర్కౌట్ అయినా కథ – కథనంలో మాత్రం కాస్త సాగదీత, కొన్ని లాజిక్స్ మిస్ అవ్వడం ఉంటుంది. మంగుళూరు లొకేషన్స్ ని బాగా చూపించారు. నిర్మాతలకు ఇదే మొదటి సినిమా కావడంతో బాగానే కావాల్సినంత ఖర్చుపెట్టారు.
రేటింగ్: 3