• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

నార్నే నితిన్, నయన్ సారిక జంటగా ‘ఆయ్’

admin by admin
March 4, 2024
in Cinema, deccanfilm.com, gallery, Latest News, Movies, news, special
0
నార్నే నితిన్, నయన్ సారిక జంటగా ‘ఆయ్’
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

వరుస విజయవంతమైన చిత్రాలను రూపొందిస్తోన్న నిర్మాణ సంస్థ GA 2 పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.9 చిత్రం ‘ఆయ్’. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతోంది. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, హీరోయిన్ నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కంచిపల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాస్‌తో విద్య కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘ఆయ్’ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌ను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఈ హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్ టైటిల్‌ను అనౌన్స్ చేశారు. నిర్మాత బన్నీవాస్, హీరో నార్నే నితిన్, హీరోయిన్ నయన్ సారిక, డైరెక్టర్ అంజి కంచిపల్లి మధ్య జరిగే సరదా ఫోన్ సంభాషణతో టైటిల్‌ను వినూత్నంగా ప్రకటించటం విశేషం.

ప్రొడ్యూసర్స్ లో ఒకరైన బన్నీవాస్ దర్శకుడు అంజికి ఫోన్ చేస్తారు. టైటిల్ గురించి మాట్లాడే సందర్భంలో డైరెక్టర్ గోదావరి ప్రాంత ప్రజలు మాట్లాడే ‘ఆయ్’ పదంతో విసిగిపోతారు. అదే క్రమంలో హీరో, హీరోయిన్ లకు సైతం కాల్ కనెక్ట్ చేస్తారు. ఈ సందర్భంగా ‘ఆయ్’ని తప్పుగా టీమ్ అర్థం చేసుకోవటంతో వీడియో చూస్తున్నవారికి నవ్వు తెప్పిస్తుంది.

నిర్మాత సరదా సంభాషణ, ఫన్నీ మీమ్స్ రెఫరెన్స్‌లతో టైటిల్ అనౌన్స్‌మెంట్స్ కాన్సెప్ట్ వీడియో అందరినీ ఎంటర్‌టైన్ చేస్తోంది. ఇదే క్రమంలో నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ ‘సమ్మర్‌లో కలుద్దాం’ అంటూ సినిమా సమ్మర్ లో విడుదలవుతుందని తెలియజేశారు. అలాగే సినిమా ఫస్ట్ లుక్ మార్చి 7న రిలీజ్ అవుతుందని వీడియో చివరలో రివీల్ చేశారు.

ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రం కోసం అత్యుత్తమమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేశారు. అలాగే సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు. త్వరలోనే మరిన్ని ఎగ్జయిటింగ్ డీటెయిల్స్ ను చిత్ర యూనిట్ ప్రకటించనుంది.

GA2 పిక్చర్స్:

ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, డైనమిక్ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్ కలయికలో GA2 పిక్చర్స్ కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలను అందిస్తూ వస్తున్నారు. భలే భలే మగాడివోయ్, గీతా గోవిందం, టాక్సీవాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి హిట్ చిత్రాలు ఈ బ్యానర్‌లో రూపొందాయి.

నటీనటులు: నార్నే నితిన్, నయన్ సారిక తదితరులు

సాంకేతిక వర్గం:

బ్యానర్ – GA2 పిక్చర్స్
సమర్పణ – అల్లు అరవింద్
నిర్మాతలు – బన్నీ వాస్, విద్యా కొప్పినీడి
డైరెక్టర్ – అంజి కంచిపల్లి
సహ నిర్మాతలు – భాను ప్రతాప్, రియాజ్ చౌదరి
సినిమాటోగ్రఫీ – సమీర్ కళ్యాణి
సంగీతం – రామ్ మిర్యాల
ఎడిటర్ – కోదాటి పవన్ కళ్యాణ్
ఆర్ట్ డైరెక్టర్ – కిరణ్ కుమార్ మన్నె
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – అజయ్ గద్దె
కాస్ట్యూమ్స్ – సుష్మిత, శిల్ప
కో డైరెక్టర్ – రామ నరేష్ నున్న
పి.ఆర్.ఒ – వంశీ కాకా
మార్కెటింగ్ – విష్ణు తేజ్ పుట్ట
పోస్టర్స్ – అనిల్, భాను
GA2 Pictures Production No.9 titled “AAY”, a hilarious phone call ft. Bunny Vas, Narne Nithiin, Nayan Sarika and Anji Kanchipalli surprises

The most successful and prestigious production GA 2 Pictures next Production No.9 stars young and energetic hero Narne Nithiin and gorgeous Nayan Sarika in lead roles. The film is directed by debutant filmmaker Anji Kanchipalli. Talented producers Bunny Vas and Vidya Koppineedi are bankrolling the movie which has stellar cast in prominent roles.

The filming has wrapped up, and post-production is currently underway. In the meantime, the promotional campaign kicked off with a hilarious title announcement. A phone call involving producer Bunny Vas, hero Narne Nithiin, heroine Nayan Sarika, and director Anji Kanchipalli unveils the movie’s title.

The call starts with the producer pressing the director for the movie’s title. Growing tired of the director’s repeated “AAY” responses, the producer adds the hero and heroine to the conversation. The situation becomes comical as the team misunderstands “AAY,” thinking it’s just a typical response from Godavari people.

Filled with the producer’s witty remarks and fun meme references, the title announcement concept video entertains everyone. Bunny Vas also shares that the movie is set for a summer release, saying “Summerlo Kummedham.” The video concludes with the announcement that the film’s first look will be released on March 7th.

This ambitious project sees the coming together of some of the finest acting and technical talents. Ace producer Allu Aravind garu presenting the film. Art direction is handled by Kiran Kumar Manne while cinematography is by Sameer Kalyani. Music is scored by Ram Miryala. More details about this exciting project are awaited.

About GA2 pictures:

Through the GA2 Pictures banner, the dynamic duo of Ace Producer Allu Aravind garu and producer Bunny Vas always delivered super hit and content-oriented films. The banner is known for blockbusters such as Bhale Bhale Magadivoy, Geetha Govindam, Taxiwala, Prathi Roju Pandage, Most Eligible Bachelor, and more.

Cast: Narne Nithiin, Nayan Sarika and others

Technical Team:

Banner: GA2 Pictures
Presenter: Allu Aravind
Producers: Bunny Vas & Vidya Koppineedi
Director: Anji Kanchipalli
Co-Producers: Bhanu Pratapa, Riyaz Chowdary
DOP: Sameer Kalyani
Music : Ram Miriyala
Editor: Kodati Pavan Kalyan
Art Director: Kiran Kumar Manne
Executive Producer: Ajay Gadde
Costumes: Susmitha & Shilpa
Co-Director: Rama Naresh Nunna
PRO: Vamsi Kaka
Marketing: Vishnu Thej Putta
Posters: Anil & Bhanu

Previous Post

సందడిగా “ష‌ర‌తులు వ‌ర్తిసాయి” ట్రైలర్ విడుదల

Next Post

ఆట సందీప్ చేతుల మీదుగా “ఐశ్వర్య సిల్క్స్” 3వ వార్షికోత్సవ వేడుక ప్రారంభం

Next Post
ఆట సందీప్ చేతుల మీదుగా “ఐశ్వర్య సిల్క్స్” 3వ వార్షికోత్సవ వేడుక ప్రారంభం

ఆట సందీప్ చేతుల మీదుగా "ఐశ్వర్య సిల్క్స్" 3వ వార్షికోత్సవ వేడుక ప్రారంభం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 29, 2025
0

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

సంపత్ నంది ఆవిష్కరించిన “ఫైటర్ శివ” ఫస్ట్ లుక్ పోస్టర్

by admin
July 27, 2025
0

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

ఘనంగా ‘కింగ్‌డమ్’ ట్రైలర్ ఆవిష్కరణ వేడుక

by admin
July 27, 2025
0

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

మదనపల్లె యువ నటుడు వెంకటేష్ పెద్దపాలెం పవర్‌ఫుల్ నటనతో అలరించనున్న ‘వన్ బై ఫోర్’ (ONE/4) చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది!

by admin
July 26, 2025
0

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

‘హరి హర వీరమల్లు’ చిత్రంతో మా లక్ష్యం నెరవేరింది : చిత్ర విజయోత్సవ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 24, 2025
0

U/A సర్టిఫికేట్ పొందిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం

రివ్యూ: హరిహర వీరమల్లు

by admin
July 24, 2025
0

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

ఘనంగా ‘హరి హర వీరమల్లు’ ప్రీ రిలీజ్ వేడుక

by admin
July 22, 2025
0

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఎ.ఎం.రత్నం గారు: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్

by admin
July 22, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.