అన్షు, వాసవి గణేషన్ హీరో హీరోయిన్లుగా బిక్షు దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘హుషారు పిట్టలు’. పద్మ అమ్మ, బీవీజీ స్టూడియోస్ సమర్పణలో రుద్ర క్రాంతి పిక్చర్స్ పతాకంపై వెంకట్ యాదవ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టీజర్ ఇటీవల విడుదలై సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నుంచి ప్రముఖ సింగర్ మంగ్లీ ఆలపించిన ‘టోంగా.. టోంగా’ అనే మాస్ అండ్ హుషారు గీతాన్ని బుధవారం గ్రాండ్‌గా విడుదల చేశారు. చరణ్ అర్జున్ సంగీతం అందించిన ఈ పాటకు ఎస్.ఎస్.చిరంజన్ సాహిత్యం సమకూర్చారు.
ప్రముఖ నిర్మాణ సంస్థలు ఏషియన్ సురేష్ ఫిలింస్ ద్వారా ఈ చిత్రాన్ని ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో భారీగా విడుదల చేయనున్నారు. ఈ పాట విడుదల సందర్భంగా చిత్ర బృందం మీడియాతో ముచ్చటించింది.
🎤 ప్రెస్ మీట్ హైలైట్స్:
బెక్కెం వేణుగోపాల్: “ఈ సినిమా చూసి నేను ఎంతో ఇంప్రెస్ అయ్యాను. ఓ చిన్న సినిమాకు ఆగస్టు 15 లాంటి మంచి రిలీజ్ డేట్ దొరకడం లక్కీ. ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ ఉంది. చిన్న సినిమా అయినా ఎక్కడా రాజీపడకుండా పాషనేట్‌గా వెంకట్ ఈ సినిమా తీశారు. చరణ్ అర్జున్ మ్యూజిక్ సినిమాకు ప్లస్ అవుతుంది.”
దర్శకుడు బిక్షు: “టీజర్ చూసి నన్ను ట్రోల్ చేసి పాపులర్ చేశారు. కానీ సినిమా చూశాక నెగెటివ్ కామెంట్స్ చేసిన వారే తమ మాటల్ని వెనక్కి తీసుకుంటారు. ఇదే సినిమాను తమిళ్, మలయాళంలో తీసుంటే ప్రశంసించేవారు. తెలుగులో ఈ చిత్రం కొత్త ట్రెండ్ సృష్టిస్తుంది. పుట్ట చిట్టి పాత్రకు వాసవి ప్రాణం పోసింది.”
నిర్మాత వెంకట్ యాదవ్: “టీజర్ చూసి కొంతమంది తెలియక బ్యాడ్ కామెంట్స్ చేశారు. కానీ అసలు కథ థియేటర్‌లో చూస్తే అందరి హృదయాలకు హత్తుకుంటుంది. సురేష్‌బాబు గారు ఈ సినిమాను విడుదల చేయడం అంటేనే కంటెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. బెక్కెం వేణుగోపాల్ గారి సపోర్ట్ మరువలేనిది.”
సంగీత దర్శకుడు చరణ్ అర్జున్: “నేను మ్యూజిక్ చేసిన సినిమాకు సాంగ్ ఈవెంట్ చేయడం సంతోషంగా ఉంది. మంగ్లీ పాడిన ఈ పాట చాలా సందడిగా ఉంటుంది. ఆగస్టు 15 నాకు చాలా స్పెషల్ డే. సూపర్ హిట్ సినిమాకు పనిచేశానన్న ఫీల్ ఈ సినిమాకు కలిగింది.”
హీరో అన్షు: “నా ఫేవరెట్ సింగర్ మంగ్లీ గారు నా సినిమాలో పాడటం ఆనందంగా ఉంది. టీజర్ చూసి అందరూ అపార్థం చేసుకున్నారు. కానీ సినిమా చూశాక అందరి ఆలోచనలు మారిపోతాయి. కంటెంట్ మీద మాకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది.”
హీరోయిన్ వాసవి గణేషన్: “దర్శక నిర్మాతల సూచనలతోనే ఈ సినిమా చేశాను. టీజర్ చూసి చాలా నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. కానీ రియల్ లైఫ్‌లో వాసవి వేరు, సినిమాలో ‘పుట్ట చిట్టి’ పాత్ర వేరు. సినిమా చూశాక మీకే అర్థమవుతుంది. టోంగా టోంగా పాట అందరికీ నచ్చుతుంది.”
ఈ కార్యక్రమంలో నటులు గోవర్థన్, నవీన్, అంజిలతో పాటు సినిమాటోగ్రాఫర్ రుద్రసాయి, గీత రచయిత ఎస్.ఎస్.చిరంజన్ తదితరులు పాల్గొన్నారు.









