• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, August 29, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

థియేటర్స్ లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తుంటే సినిమా కోసం పడిన కష్టం మర్చిపోతున్నాం – హీరో కికు యనమల

Maari by Maari
August 29, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
థియేటర్స్ లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తుంటే సినిమా కోసం పడిన కష్టం మర్చిపోతున్నాం – హీరో కికు యనమల

Share and Enjoy !

Shares
Twitter

* రక్షాబంధన్ విన్నర్ “చిరంజీవి” సినిమా గ్రాండ్ సక్సెస్ మీట్

థియేటర్స్ లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తుంటే సినిమా కోసం పడిన కష్టం మర్చిపోతున్నాం – హీరో కికు యనమల

కికు యనమల, కశిష్ ఖాన్ జంటగా నటించిన యూనిక్ సర్వైవల్ థ్రిల్లర్ మూవీ “చిరంజీవి” రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాను కికు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై దీప్తి నడిమింటి నిర్మించారు. శుభ సాయి వెంకట్ దర్శకత్వం వహించారు. “చిరంజీవి” సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల ఆదరణతో బాక్సాఫీస్ వద్ద రక్షాబంధన్ విన్నర్ గా మారింది. ఈ నేపథ్యంలో చిత్ర గ్రాండ్ సక్సెస్ మీట్ ను ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో

ఎడిటర్ ఛోటా కె ప్రసాద్ మాట్లాడుతూ – ఈ టీమ్ లోని వాళ్లంతా ఒక కొత్త కథను, ఎక్స్ట్రార్డినరీ కాన్సెప్ట్ ను నమ్మి నిజాయితీగా కష్టపడి పనిచేశారు. అలా పనిచేసినప్పుడు సినిమా తప్పకుండా విజయం సాధిస్తుంది. ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది. కమర్షియల్ గా ఆ సినిమా రేంజ్ ఏంటి అనే కంటే క్రియేటివ్ గా ఎంత పేరు తెచ్చుకుంది, ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకుంది అనేది ముఖ్యం. ఈ సినిమా టీమ్ ఆ విషయంలో విజయం సాధించారు. కొత్త వాళ్లు ఎవరైనా సినిమా చేస్తుంటే ఇలాంటి టీమ్ ను చూసి నేర్చుకోమని చెబుతాను. వీళ్లు నాకు బంధువులు కాదు, ఒక మంచి టీమ్ కు, జెన్యూన్ టీమ్ కు సపోర్ట్ చేయాలనే నేను ఈ మూవీకి వర్క్ చేశాను. అన్నారు.

డైరెక్టర్ శుభ సాయి వెంకట్ మాట్లాడుతూ – ఈ సినిమా ఫస్ట్ కాపీ వచ్చిన రోజే మేము సక్సెస్ సాధించామని సంతోషించాం. ఎందుకంటే షూటింగ్ టైమ్ లోనే మా సినిమాకు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మధ్యలో షూటింగ్ ఆగిపోయింది. మళ్లీ ఎప్పుడు మొదలవుతుందో తెలియలేదు. రిలీజ్ టైమ్ లో ఇబ్బందులు వచ్చాయి. అలా సమస్యలన్నీ దాటుకుని థియేట్రికల్ రిలీజ్ చేసినప్పుడే మేము విజయం సాధించామని నమ్మాం. ఇప్పుడు ప్రేక్షకులు ఆదరించడం నిజమైన ఆనందాన్ని కలిగిస్తోంది. ఈ సినిమా విషయంలో మేము అనేక దశల్లో సక్సెస్ అవుతూ వచ్చాం. ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద విజయాన్ని అందుకున్నాం. సినిమా చూసిన వాళ్లు మంచి సినిమా అంటూ చెబుతున్నారు. అన్నారు.

ప్రొడ్యూసర్ దీప్తి నడిమింటి మాట్లాడుతూ – మా సినిమాకు విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతున్నాం. సినిమా రిలీజ్ రోజు రిజల్ట్ ఎలా ఉంటుందో అని భయపడ్డాను. నాకు నేనే ధైర్యం చెప్పుకున్నాను. ప్రొడ్యూసర్ గా నేను భయపడితే మిగతా టీమ్ అంతా కుంగిపోతారు. అందకే ధైర్యంగా రేపు అంతా సెట్ అవుతుందని నమ్మాను. కంటెంట్ బాగుంటే చిన్న సినిమానైనా ఆదరిస్తారని మీరు మరోసారి ప్రూవ్ చేశారు. ఈ సినిమా మాకు ఎన్నో ఎక్సిపీరియన్స్ లు ఇచ్చింది. అవన్నీ నెక్ట్స్ సినిమాకు మాకు ఉపయోగపడతాని భావిస్తున్నాం. హీరోయిన్ ఎంపిక విషయంలోనూ సరైన నిర్ణయం తీసుకోలేదు. నేనైతే తెలుగు అమ్మాయిలకు అవకాశం ఇవ్వాలని అనుకున్నా, అయితే మా సినిమాలోని ఒక రొమాంటిక్ సాంగ్ చేసేందుకు తెలుగు అమ్మాయిలు ఇబ్బంది పడ్డారు. నెక్ట్స్ మూవీలో తప్పకుండా తెలుగు అమ్మాయినే హీరోయిన్ గా తీసుకుంటాం. ఈ విజయంతో మా టీమ్ అంతా హ్యాపీగా ఉన్నాం. నెక్ట్స్ కూడా స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమానే నిర్మిస్తాం. అన్నారు.

హీరో కికు యనమల మాట్లాడుతూ – మా సినిమాకు ప్రేక్షకుల ఆదరణ దక్కడం సంతోషంగా ఉంది. నేను థియేటర్స్ కు వెళ్లి వాళ్ల రెస్పాన్స్ స్వయంగా చూస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. మూవీలోని ఎమోషన్ కు ప్రేక్షకులు ఎంతగా కనెక్ట్ అయ్యారు అనేది వాళ్ల కళ్లలో తెలుస్తోంది. ప్రేక్షకుల రెస్పాన్స్ చూసి సినిమా కోసం మేము పడిన కష్టం మర్చిపోతున్నాం. చిరంజీవి గారి పేరు పలకాలన్నా మనం హ్యపీగా ఫీలవుతాం. అలాంటిది ఆయన గురించి నెగిటివ్ గా ఎందుకు చెబుతాం. మా సినిమాలోని కంటెంట్ గురించి తెలియని కొందరు ఎవరో నెటిజన్స్ తప్పుగా భావించారు. మేము నిజాయితీగా మా కంటెంట్ ను నమ్మి సినిమా చేశాం కాబట్టి ఎవరేం అన్నా భయపడలేదు. మా మూవీలో ఈశ్వరీరావు మదర్ క్యారెక్టర్ లో నటించారు. ఆమెతో నా కాంబినేషన్ సీన్ ఒకటి ఉంది. ఆ సీన్ చేసేప్పుడు సెట్ లోని వారు బాగా నటించారంటూ అప్రిషియేట్ చేశారు. అలా వారి ప్రోత్సాహమే సినిమాలో బాగా పర్ ఫార్మ్ చేసేలా ఇన్స్ పైర్ చేసింది. తెలుగు తెరపైకి మరింత మంది కొత్త హీరోలు వస్తారనే నమ్మకం నాలో ఉంది. అన్నారు

నటీనటులు – కికు యనమల, కశిష్ ఖాన్, తనికెళ్ల భరణి, శ్రీకాంత్ భరత్, వైవా రాఘవ, గిరీష్, తదితరులు

టెక్నికల్ టీమ్
——————–

డీవోపీ – రామకృష్ణ
మ్యూజిక్ – శేఖర్ చంద్ర
ఎడిటింగ్ – ఛోటా కె ప్రసాద్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – యష్ మిట్టల్
కొరియోగ్రఫీ – గోవింద్, శుభ సాయి వెంకట్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కే మీడియా)
ప్రొడ్యూసర్- దీప్తి నడిమింటి
స్క్రిప్ట్, డైరెక్షన్- శుభా సాయి వెంకట్

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

పిల్లలతో ‘సమ్మర్ హాలిడేస్’ సినిమా చేయడం ప్రొడ్యూసర్‌గా ఎంతో సంతృప్తినిస్తోంది: ధీరజ్ మొగిలినేని

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

థియేటర్స్ లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తుంటే సినిమా కోసం పడిన కష్టం మర్చిపోతున్నాం – హీరో కికు యనమల

థియేటర్స్ లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తుంటే సినిమా కోసం పడిన కష్టం మర్చిపోతున్నాం – హీరో కికు యనమల

by Maari
August 29, 2026
0

పిల్లలతో ‘సమ్మర్ హాలిడేస్’ సినిమా చేయడం ప్రొడ్యూసర్‌గా ఎంతో సంతృప్తినిస్తోంది: ధీరజ్ మొగిలినేని

పిల్లలతో ‘సమ్మర్ హాలిడేస్’ సినిమా చేయడం ప్రొడ్యూసర్‌గా ఎంతో సంతృప్తినిస్తోంది: ధీరజ్ మొగిలినేని

by Maari
August 29, 2026
0

యం.యస్‌ వారాహి, శిమమ్‌ మీడియా పతాకాలు నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌

యం.యస్‌ వారాహి, శిమమ్‌ మీడియా పతాకాలు నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌

by Maari
August 29, 2026
0

నాకు “రంగస్థలం” తర్వాత పాటల పరంగా అంత సంతృప్తిని, సంతోషాన్నిచ్చిన చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’- ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్

నాకు “రంగస్థలం” తర్వాత పాటల పరంగా అంత సంతృప్తిని, సంతోషాన్నిచ్చిన చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’- ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్

by Maari
August 29, 2026
0

రాఖీ పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లకు అండగా నిలిచిన సంజోష్

రాఖీ పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లకు అండగా నిలిచిన సంజోష్

by Maari
August 28, 2026
0

శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు

శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు

by Maari
August 28, 2026
0

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, కే కే మేనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘LEGACY’

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, కే కే మేనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘LEGACY’

by Maari
August 27, 2026
0

“రోమాంచకం” సూపర్ హిలేరియస్ మూవీ. ఈ కథ విన్నప్పుడు ఎంత నవ్వుకున్నానో, సినిమా చూస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువగా నవ్వుకున్నాను – సందీప్ రెడ్డి వంగా

“రోమాంచకం” సూపర్ హిలేరియస్ మూవీ. ఈ కథ విన్నప్పుడు ఎంత నవ్వుకున్నానో, సినిమా చూస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువగా నవ్వుకున్నాను – సందీప్ రెడ్డి వంగా

by Maari
August 26, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.