• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
Saturday, August 29, 2026
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

పిల్లలతో ‘సమ్మర్ హాలిడేస్’ సినిమా చేయడం ప్రొడ్యూసర్‌గా ఎంతో సంతృప్తినిస్తోంది: ధీరజ్ మొగిలినేని

Maari by Maari
August 29, 2026
in Cinema, deccanfilm.com, epaper, gallery, Latest News, Movies, news, Politics, Politics, special, sports
0
పిల్లలతో ‘సమ్మర్ హాలిడేస్’ సినిమా చేయడం ప్రొడ్యూసర్‌గా ఎంతో సంతృప్తినిస్తోంది: ధీరజ్ మొగిలినేని

Share and Enjoy !

Shares
Twitter

పిల్లలతో “సమ్మర్ హాలిడేస్” సినిమా నిర్మించడం ప్రొడ్యూసర్ గా ఎంతో సంతృప్తిని, సంతోషాన్ని కలిగిస్తోంది – ‘స్కూల్ సాంగ్’ లాంఛ్ ఈవెంట్ లో ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై “సమ్మర్ హాలిడేస్” అనే చిల్డ్రన్ మూవీని నిర్మిస్తున్నారు. “సమ్మర్ హాలిడేస్” సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. త్వరలోనే “సమ్మర్ హాలిడేస్” సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో జరిగిన ఈవెంట్ లో ఈ సినిమాలోని ‘స్కూల్ సాంగ్..’ రిలీజ్ చేశారు. సందడిగా సాగిన ఈ కార్యక్రమంలో

కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మాట్లాడుతూ – ‘స్కూల్ సాంగ్..’ కు డ్యాన్స్ కంపోజ్ చేయడాన్ని ఎంజాయ్ చేశాను. ఈ పాటకు కొరియోగ్రాఫ్ చేసే ముందు డైరెక్టర్ శ్రీకర్ ఈ పాట ముందు వెనక ఉండే సీన్స్ చూపించాడు. ఆ బ్యూటిఫుల్ సీన్స్ నన్ను ఇన్స్ పైర్ చేశాయి. సింజిత్ కంపోజ్ చేసిన సాంగ్ చూసి ఎగ్జైట్ అయ్యాను. ఆ మ్యూజిక్ కు తగినట్లు స్టెప్స్ రూపకల్పన చేశాను. డైరెక్టర్ చెప్పినట్లు మంచి హుక్ స్టెప్స్ డిజైన్ చేశాను. పిల్లలతో పాటు తల్లిదండ్రులు అంతా చూడాల్సిన చిత్రమిది. సినిమాలో బ్యూటిఫుల్ ఎమోషన్స్ మిమ్మల్ని ఆకట్టుకుంటాయి. అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి మాట్లాడుతూ – పిల్లలతో ఒక పూర్తి పాట పాడించాలనేది నా డ్రీమ్. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది. సింగర్ విశ్వదత్తా ఈ పాటను ఎంతో అందంగా పాడాడు. జి సరిగమపా విన్నర్ ఆ అబ్బాయి. అతనికి తొలి పాట ఇది. ఈ పాటకు కొరియోగ్రఫీ చాలా ఇంపార్టెంట్. సందీప్ మంచి హుక్ స్టెప్స్ ఇచ్చారు. ఈ సినిమా చాలా బాగా వచ్చింది. మూవీ మీ అందరినీ ఎంటర్ టైన్ చేస్తుంది. అన్నారు.

సింగర్ విశ్వదత్తా మాట్లాడుతూ – ఈ సాంగ్ పాడే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ సాంగ్ పాడే అవకాశం కల్పించిన సింజిత్ గారికి కృతజ్ఞతలు. స్కూల్ సాంగ్ పాట మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ పాట విని ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.

నటి వాసుకి మాట్లాడుతూ – నేను ఎంతోమంది పేరున్న ఆర్టిస్టులతో కలిసి నటించాను. కానీ ఈ పిల్లలతో కలిసి నటిస్తున్నప్పుడు మాత్రం టెన్షన్ పడ్డాను. వీరిలో అపారమైన నట ప్రతిభ ఉంది. అప్పట్లో అంజలి అంజలి పాట విన్నప్పుడు ఎంత హ్యాపీగా ఫీలయ్యానో ఈ సినిమాలోని స్కూల్ సాంగ్ కు కూడా అంతే సంతోషించాను. పిల్లల నేపథ్య సినిమా చేయాలంటే గట్స్ కావాలి. ఆ అభిరుచి, సాహసం మా ధీరజ్ గారిలో ఉన్నాయి. శ్రీకర్ ఈ చిత్రాన్ని బ్యూటిపుల్ ఎమోషన్స్ తో రూపొందించారు. సింజిత్ కంపోజ్ చేసిన సాంగ్ ను తన కొరియోగ్రఫీతో సందీప్ మరింత ఆకట్టుకునేలా చేశారు. అన్నారు.

చైల్డ్ ఆర్టిస్ట్ అరుణ్ మాట్లాడుతూ – మా మూవీ సాంగ్ లాంఛ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్.పిల్లలుగా మాకు చదువులు, ఆటలు, పేరెంట్స్ తో అనుబంధం అంతా ఈ పాటలో డైరెక్టర్ శ్రీకర్ గారు చూపించారు. నా వయసు పిల్లలంతా ఈ పాటతో బాగా కనెక్ట్ అవుతారు. ఈ పాటలో నేను పడిన ఎమోషన్స్ అన్నీ ప్రతి పిల్లాడిలోనూ కనిపిస్తాయి. ధీరజ్ గారు ఒక సోదరుడిలా మిమ్మల్ని చూసుకున్నారు. ఆయన ప్యాషన్ వల్లే ఇంత మంచి మూవీ నిర్మిస్తున్నారు. డైరెక్టర్ శ్రీకర్ ఒక పిల్లాడిలా మాలో కలిసిపోయారు. అలాంటి చిన్న పిల్లాడి మనస్తత్వం ఆయనది. ఈ పాటను సింజిత్ బ్యూటిపుల్ గా కంపోజ్ చేసారు. సందీప్ అన్న మంచి స్టెప్స్ చేయించారు. అన్నారు.

డైరెక్టర్ శ్రీకర్ మాట్లాడుతూ – మా సినిమాకు ఒకే ఒక్క హీరో ప్రొడ్యూసర్ ధీరజ్ గారు. ఆయన వల్లే ఈ పాటను ఇంత గ్రాండ్ గా చేయగలిగాం. నేను ఈ మూవీకి సంబంధించిన ఏదైనా ఆయనతోనే చెబుతుంటాను. తనలోని ప్యాషన్ వల్లే ఈ పాటను ఇంత బాగా చేయగలిగాం. మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ గురించి నేను ఎంత చెప్పినా తక్కువే. ఈ పాటకు ఆయన బ్యూటిపుల్ ట్యూన్ ఇచ్చారు.సందీప్ మాస్టర్ తన కొరియోగ్రఫీతో మరో లెవెల్ కు తీసుకెళ్లారు. ఈ పాటలో పర్ ఫార్మ్ చేసిన పిల్లలందరూ సూపర్బ్ గా పర్ పార్మ్ చేశారు. పిల్లల్ని, పెద్దల్ని ఆకట్టుకునేలా మా మూవీ త్వరలోనే మీ ముందుకు రాబోతోంది.అన్నారు.

ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ – ఈ వేదిక మీద పిల్లలంతా స్కూల్ సాంగ్ కు మంచి పర్ ఫార్మెన్స్ ఇచ్చారు. యూట్యూబ్ లో నాకు బాగా నచ్చిన పాపులర్ అయిన ఒక పాట రిఫరెన్స్ చెప్పి సింజిత్ ను సాంగ్ చేయమన్నాను. అతను ఆ పాట ఎనర్జీని మ్యాచ్ చేసేలా బ్యూటిఫుల్ ట్యూన్ ఇచ్చాడు. ఆ ట్యూన్ తో చేసిన పాటను సందీప్ మాస్టర్ సూపర్బ్ స్టెప్స్ తో మరింత అందంగా తయారుచేశారు. ఈ పాటలో వాసుకి గారు అరుణ్ ఒక స్టెప్ వేస్తారు. ఆ స్టెప్ తో పాటు మా శ్రీకర్ సీజీ షాట్స్ డిజైన్ చేశాడు. నేను అంత మంచి స్టెప్స్ అక్కడ వాసుకి గారు అరుణ్ చేస్తుంటే మళ్లీ సీజీ ఎందుకు అని అడిగాను. ఏ మూవీనైనా పాటలే ప్రేక్షకుల దగ్గరకు ముందుగా చేర్చుతాయి. ఈ పాట సింజిత్ పాడినప్పుడు ఆయన ఎనర్జీని మ్యాచ్ చేసే వాయిస్ కు ఎవరు దొరుకుతారు అని అనుకున్నాను. కానీ విశ్వదత్తా బ్యూటిఫుల్ గా పాడాడు. ఆయన గొంతు విని నేను పెద్ద అబ్బాయి అనుకున్నా. కిట్టూ విస్సాప్రగడ మా సినిమాలోని పాటలకు మంచి సాహిత్యం అందిస్తున్నారు. నేను స్టార్స్ తో సినిమాలు ప్రొడ్యూస్ చేశాను. కానీ నాకు ఈ పిల్లలతో సినిమా చేస్తున్నప్పుడు ఎక్కువ సంతోషం, సంతృప్తి కలిగాయి. ఇప్పుడు మూవీస్ బాగా ఆడుతున్నాయి. ఈ టైమ్ లో బాక్సాఫీస్ దగ్గర పోటీకి దిగే జానర్ మూవీ కాదిది. పిల్లలు, పేరెంట్స్ అందరూ థియేటర్స్ కు వచ్చి సినిమా చూడగలిగితే డేట్ చూసి రిలీజ్ చేయాలని అనుకుంటున్నాము. ఈ సినిమాను అక్టోబర్ 2న రిలీజ్ చేయాలనుకున్నాము. కానీ అప్పుడు ఒక పెద్ద సినిమా వస్తోంది. అక్టోబర్ లో మా మూవీ రిలీజ్ ప్లాన్ చేయబోతున్నాం. అన్నారు.

నటీనటులు – రోహన్ రాయ్, అరుణ్, ఖుషి, జయసుధ, రాజీవ్ కనకాల, వాసుకి, హర్షిణి, హర్షవర్థన్, తదితరులు

టెక్నికల్ టీమ్
——————–
డీవోపీ – సాయి ప్రకాశ్
మ్యూజిక్ డైరెక్టర్ – సింజిత్ యెర్రమల్లి
బ్యానర్ – ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్
పీఆర్ఓ – సురేష్ (ఎస్ కె మీడియా)
ప్రొడ్యూసర్ – ధీరజ్ మొగిలినేని
స్టోరీ, డైరెక్టర్ – శ్రీకర్

Share and Enjoy !

Shares
Twitter
Previous Post

యం.యస్‌ వారాహి, శిమమ్‌ మీడియా పతాకాలు నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌

Next Post

థియేటర్స్ లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తుంటే సినిమా కోసం పడిన కష్టం మర్చిపోతున్నాం – హీరో కికు యనమల

Next Post
థియేటర్స్ లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తుంటే సినిమా కోసం పడిన కష్టం మర్చిపోతున్నాం – హీరో కికు యనమల

థియేటర్స్ లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తుంటే సినిమా కోసం పడిన కష్టం మర్చిపోతున్నాం - హీరో కికు యనమల

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

థియేటర్స్ లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తుంటే సినిమా కోసం పడిన కష్టం మర్చిపోతున్నాం – హీరో కికు యనమల

థియేటర్స్ లో ప్రేక్షకుల రెస్పాన్స్ చూస్తుంటే సినిమా కోసం పడిన కష్టం మర్చిపోతున్నాం – హీరో కికు యనమల

by Maari
August 29, 2026
0

పిల్లలతో ‘సమ్మర్ హాలిడేస్’ సినిమా చేయడం ప్రొడ్యూసర్‌గా ఎంతో సంతృప్తినిస్తోంది: ధీరజ్ మొగిలినేని

పిల్లలతో ‘సమ్మర్ హాలిడేస్’ సినిమా చేయడం ప్రొడ్యూసర్‌గా ఎంతో సంతృప్తినిస్తోంది: ధీరజ్ మొగిలినేని

by Maari
August 29, 2026
0

యం.యస్‌ వారాహి, శిమమ్‌ మీడియా పతాకాలు నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌

యం.యస్‌ వారాహి, శిమమ్‌ మీడియా పతాకాలు నిర్మిస్తున్న సినిమాలో ప్రముఖ ఫోక్‌ స్టార్‌ కిట్టు పవన్‌

by Maari
August 29, 2026
0

నాకు “రంగస్థలం” తర్వాత పాటల పరంగా అంత సంతృప్తిని, సంతోషాన్నిచ్చిన చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’- ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్

నాకు “రంగస్థలం” తర్వాత పాటల పరంగా అంత సంతృప్తిని, సంతోషాన్నిచ్చిన చిత్రం ‘ధర్మస్థల నియోజకవర్గం’- ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్

by Maari
August 29, 2026
0

రాఖీ పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లకు అండగా నిలిచిన సంజోష్

రాఖీ పండుగ సందర్భంగా అక్కాచెల్లెళ్లకు అండగా నిలిచిన సంజోష్

by Maari
August 28, 2026
0

శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు

శ్రీ పట్టాభిరామచంద్ర స్వామి ఆలయ ప్రతిష్ఠా మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దిల్‌రాజు

by Maari
August 28, 2026
0

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, కే కే మేనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘LEGACY’

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, కే కే మేనన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘LEGACY’

by Maari
August 27, 2026
0

“రోమాంచకం” సూపర్ హిలేరియస్ మూవీ. ఈ కథ విన్నప్పుడు ఎంత నవ్వుకున్నానో, సినిమా చూస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువగా నవ్వుకున్నాను – సందీప్ రెడ్డి వంగా

“రోమాంచకం” సూపర్ హిలేరియస్ మూవీ. ఈ కథ విన్నప్పుడు ఎంత నవ్వుకున్నానో, సినిమా చూస్తున్నప్పుడు అంతకంటే ఎక్కువగా నవ్వుకున్నాను – సందీప్ రెడ్డి వంగా

by Maari
August 26, 2026
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

Share

Blogger
Bluesky
Delicious
Digg
Email
Facebook
Facebook messenger
Flipboard
Google
Hacker News
Line
LinkedIn
Mastodon
Mix
Odnoklassniki
PDF
Pinterest
Pocket
Print
Reddit
Renren
Short link
SMS
Skype
Telegram
Tumblr
Twitter
VKontakte
wechat
Weibo
WhatsApp
X
Xing
Yahoo! Mail

Copy short link

Copy link
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.