• Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews
Deccan Film
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper
No Result
View All Result
Deccan Film
No Result
View All Result

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కు గౌర‌వ‌ డాక్ట‌రేట్ అంద‌చేస్తోన్న వేల్స్ యూనివ‌ర్సిటీ

admin by admin
April 11, 2024
in Cinema, deccanfilm.com, Latest News, Movies, news, special
0
గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌కు గౌర‌వ‌ డాక్ట‌రేట్ అంద‌చేస్తోన్న వేల్స్ యూనివ‌ర్సిటీ
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

అద్భుత‌మైన సినిమాలు చేస్తూ త‌న‌దైన ఇమేజ్‌ను సంపాదించుకున్న గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ కీర్తి కిరీటంలో మ‌రో డైమండ్ చేరింది. చెన్నైకు చెందిన ప్ర‌ముఖ వేల్స్ యూనివ‌ర్సిటీ ఆయ‌న‌కు గౌర‌వ డాక్ట‌రేట్‌ను అందిస్తోంది. దీంతో ఆయ‌న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామ‌న్‌, స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ వంటి వారి స‌ర‌స‌న చేరారు. సినిమా దాన్ని మించిన ఆయ‌న ప్ర‌భావ‌మే అందుకు కార‌ణం.

సినీ ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన మొద‌లు ఇప్పుడు గ్లోబ‌ల్ స్టార్ ఇమేజ్ వ‌చ్చేంత వ‌ర‌కు ఆయ‌న అంకిత భావంతో అసాధార‌ణ ప్ర‌తిభ‌ను చూపించారు. ఇటీవ‌ల రామ్‌చ‌ర‌ణ్‌ న‌టించిన ఆర్ఆర్ఆర్ సినిమా సాధించిన విజ‌యంతో రియ‌ల్ గేమ్ ఛేంజ‌ర్‌గా మారి గ్లోబ‌ల్ స్టార్ బిరుదుని సొంతం చేసుకున్నారు.

వివిధ రంగాల్లో విశిష్ట వ్య‌క్తుల‌ను గుర్తించి వారికి గౌర‌వ డాక్ట‌రేట్స్ ఇవ్వ‌టంలో వేల్స్ యూనివ‌ర్సిటీ ప్ర‌సిద్ధి చెందింది. ఈ ఏడాదికిగానూ ఎంట‌ర్‌టైన్‌మెంట్ రంగంలో ఎంట‌ర్‌ప్రెన్యూర‌ర్‌గా రామ్ చరణ్ చేసిన సేవ‌ల‌కు వేల్స్ యూనిర్సిటీ ఆయ‌న‌కు గౌర‌వ డాక్ట‌రేట్‌ను అంద‌చేస్తోంది. ఈ వేడుక ఏప్రిల్ 13న గ్రాండ్‌గా జ‌ర‌గ‌నుంది. అందులో రామ్ చ‌ర‌ణ్‌తో పాటు డా.పి.వీర‌ముత్తువేల్ (ప్రాజెక్ట్ కో ఆర్డినేట‌ర్ చంద్ర‌యాన్‌, ఇస్రో), డా.జి.ఎస్‌.కెవేలు (ఫౌండ‌ర్‌, సీఎండి ట్రివిట్రోన్ హెల్త్ కేర్‌), అచంట శ‌ర‌త్ క‌మ‌ల్ (ప‌ద్మ‌శ్రీ అవార్డ్ గ్ర‌హీత‌, ప్ర‌ముఖ టేబుల్ టెన్నిల్ ప్లేయ‌ర్‌)ల‌ను కూడా గౌర‌వించ‌నున్నారు.

త‌మ అభిమాన హీరోకు ద‌క్కిన గౌర‌వంపై రామ్‌చ‌ర‌ణ్ అభిమానులు ఎంతో సంతోషంగా ఉన్నారు. సోష‌ల్ మీడియాలో అయితే ఈ వార్త తెగ వైర‌ల్ అవుతుంది. చ‌ర‌ణ్‌కు గౌర‌వ డాక్ట‌రేట్ రావ‌టంపై ప‌లువురు ఎంతో గ‌ర్వంగా ఉంద‌ని మెసేజ్‌లు పెడుతున్నారు. ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే ఆయ‌న చేయ‌బోతున్న సినిమాలు ఆయ‌న కెరీర్‌లో మరింత గొప్ప చిత్రాలుగా నిలుస్తాయి.

ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌, శంక‌ర్ కాంబినేష‌న్‌లో కియారా అద్వానీ హీరోయిన్‌గా చేస్తోన్న గేమ్ ఛేంజ‌ర్ చిత్రాన్ని ఈ ఏడాదిలో విడుద‌ల చేయ‌టానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్ష‌కులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌బోతున్న RC16 సినిమాలో చ‌ర‌ణ్‌కు జోడీగా జాన్వీ క‌పూర్ న‌టిస్తోంది. ఆస్కార్ విన్న‌ర్ ఎ.ఆర్‌.రెహ‌మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. రీసెంట్‌గానే ఈ చిత్రం ఘ‌నంగా పూజా కార్య‌క్ర‌మాల‌ను జ‌రుపుకుంది. త్వ‌ర‌లోనే సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే రంగ‌స్థ‌లం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత చ‌ర‌ణ్‌, సుకుమార్ కాంబినేష‌న్ లో సినిమా రూపొంద‌నుంది. దానికి సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డిన సంగ‌తి తెలిసిందే.

రామ్‌చ‌ర‌ణ్ త‌న అంకిత భావం, విన‌యం, న‌ట‌న‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న ప్రేక్ష‌కులు హృద‌యాల‌ను గెలుచుకున్నారు. ఈయ‌న జర్నీ ఎంతో మంది ఔత్సాహిక న‌టీన‌టుల‌కు స్ఫూర్తిదాయ‌కం. ఇప్పుడు ఆయ‌న‌కు గౌర‌వ డాక్ట‌రేట్ రావ‌టం కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన‌ట్ట‌య్యింది.

Renowned Vels University to honor Global Star Ram Charan with a Doctorate

Global Star Ram Charan continues to add accolades to his illustrious career, with the latest being an honorary doctorate from the renowned Vels University in Chennai. This recognition places him in the esteemed company of previous recipients like Finance Minister Nirmala Sitharaman and acclaimed director Shankar, highlighting his significant impact on the world of cinema and beyond.

From his early days in the industry to his current status as a global icon, Ram Charan’s journey has been defined by exceptional performances and unwavering dedication. His recent success with “RRR” has solidified his position as a true game-changer, earning him the title of ‘Global Star.’

Vels University is known for recognizing distinguished personalities across various fields. This year the University decided to confer a doctorate to Ram Charan for his contribution to the entertainment industry and also as an entrepreneur. The event will be organized extravagantly on 13 April 2024. This year, along with Ram Charan, the university will be honoring personalities like:
Dr. P. Veeramuthuvel, Project Coordinator, Chandrayaan, ISRO,Dr. GSK Velu, Founder & CMD, Trivitron Healthcare, Achanta Sharath Kamal, Renowned Table Tennis Player and Padma Shri recipient.

Fans of Ram Charan are understandably thrilled with this latest honor bestowed upon their beloved star. Social media is abuzz with celebratory messages and expressions of pride. On the professional front, Ram Charan’s upcoming projects promise to further elevate his career.

They include Game Changer: Directed by Shankar and co-starring Kiara Advani, this highly anticipated film is expected to release during Dussehra. The buzz surrounding “Game Changer” is immense, with audiences eagerly awaiting its release.
RC16: This pan-India project, directed by Buchi Babu Sana of “Uppena” fame, will see Ram Charan paired with Janhvi Kapoor and music by AR Rahman. The film recently had a grand launch and is set to begin regular shooting soon.

Ram Charan’s journey serves as an inspiration to aspiring actors and individuals alike. His dedication, talent, and humility continue to win hearts globally. As he embarks on this new chapter with the honorary doctorate, the future looks even brighter for Global Star.

Previous Post

యేటా దర్శకరత్న డి.ఎన్.ఆర్. ఫిల్మ్ అవార్డ్స్ ప్రదానం

Next Post

‘కల్లు కాంపౌండ్ 1995’ ట్రైలర్ లాంచ్

Next Post
‘కల్లు కాంపౌండ్ 1995’ ట్రైలర్ లాంచ్

'కల్లు కాంపౌండ్ 1995' ట్రైలర్ లాంచ్

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

‘ఓజీ’ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు.. బలమైన కథ, ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటాయి: కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్

‘ఓజీ’ సినిమాలో యాక్షన్ మాత్రమే కాదు.. బలమైన కథ, ఫ్యామిలీ డ్రామా కూడా ఉంటాయి: కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్

by admin
September 16, 2025
0

ఒక మధ్యతరగతి అమ్మాయి జీవితం చూపిస్తున్నాను.. డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి ఏడ్చారు.. బ్యూటీ గురించి దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్

ఒక మధ్యతరగతి అమ్మాయి జీవితం చూపిస్తున్నాను.. డిస్ట్రిబ్యూటర్స్ సినిమా చూసి ఏడ్చారు.. బ్యూటీ గురించి దర్శకుడు జె.ఎస్.ఎస్. వర్ధన్

by admin
September 15, 2025
0

మన కల్చర్ ను కాపాడుకునేలా వీర చంద్రహాస ఉంటుంది : చిత్ర దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్  రవి బస్రూర్

మన కల్చర్ ను కాపాడుకునేలా వీర చంద్రహాస ఉంటుంది : చిత్ర దర్శకుడు, మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్

by admin
September 15, 2025
0

“లిటిల్ హార్ట్స్” లాంటి  కంటెంట్ బాగున్న సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు – బన్నీవాస్

“లిటిల్ హార్ట్స్” లాంటి కంటెంట్ బాగున్న సినిమాను తప్పకుండా ప్రేక్షకులు ఆదరిస్తారు – బన్నీవాస్

by admin
September 11, 2025
0

30 లక్షల మందికి పైగా వీక్షించిన ” కానిస్టేబుల్” ట్రైలర్

30 లక్షల మందికి పైగా వీక్షించిన ” కానిస్టేబుల్” ట్రైలర్

by admin
September 10, 2025
0

లిటిల్‌ హార్ట్స్… నవ్విస్తాయి

లిటిల్‌ హార్ట్స్… నవ్విస్తాయి

by admin
September 5, 2025
0

ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ టీజర్

ఆకట్టుకుంటున్న అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ టీజర్

by admin
September 4, 2025
0

ఘాటీలో చేసిన శీలావతి క్యారెక్టర్ నా కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఘాటీ ప్రేక్షకులకు గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: క్వీన్ అనుష్క శెట్టి

ఘాటీలో చేసిన శీలావతి క్యారెక్టర్ నా కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. ఘాటీ ప్రేక్షకులకు గ్రేట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియెన్స్ ఇస్తుంది: క్వీన్ అనుష్క శెట్టి

by admin
September 3, 2025
0

  • Cinema
  • Deccan Film Daily Edition-01-10-2024
  • Home
  • Latest News
  • Political
  • Reviews

© 2024 DeccanFilm - Designed By 10gminds.

No Result
View All Result
  • Home
  • Latest News
  • Cinema
  • Politics
  • Reviews
  • Sports
  • E – Paper

© 2024 DeccanFilm - Designed By 10gminds.