గీతానంద్, నేహా సోలంకి జంటగా దయానంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గేమ్ ఆన్’. సీనియర్ నటులు మధుబాల, ఆదిత్య మీనన్, శుభలేఖ సుధాకర్ కీలక పాత్రలు పోషించారు. కస్తూరి క్రియేషన్స్ అండ్ గోల్డెన్ వింగ్ ప్రొడక్షన్స్ బ్యానర్స్‌పై రవి కస్తూరి ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ గేమ్… ఆడియన్స్ ఎలా ఆకట్టుకుందో చూద్దాం పదండి.
కథ: సిద్ధూ(గీతానంద్) ఓ సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగి. తనకి ఓ ప్రాజెక్టు విషయంలో తోటి స్నేహితులే(వాసంతి, కిరీటి) మోసం చేసి… ఆ కంపెనీలో నుంచి బయటకు రావడానికి కారణం అవుతారు. దాంతో సిద్ధూ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఆత్మహత్య చేసుకోవాలనుకుంటారు. ఇలా తన జీవితానికి ముగింపు పలికే కొద్ది క్షణాల ముందు తన మొబైల్ కి ఓ గేమ్ ఆడాలని… అందులో ఉన్న టాస్క్ ను ఒక్కొక్కటిగా ఫినిష్ చేస్తే… లక్షల రూపాయలు నీ బ్యాంకు ఖాతాలో పడతాయని ఓ అజ్ఞాతవాసి వాయిస్ తో మెసేజ్ వస్తుంది. దాంతో సిద్ధూ… విధించిన ఒక్కో టాస్క్ ను కంప్లీట్ చేసుకుంటూ వెళుతూ ఉంటారు. మరి ఈ టాక్స్ లు ఏంటి? సిద్ధూకే ఆ టాస్క్ లు విధించడానికి కారణాలు ఏమిటి? విధించిన టాస్క్ లన్నీ సిద్ధూ కంప్లీట్ చేశారా? అసలు సిద్ధూ ఎవరు? తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: ఇదొక యూనిక్ స్టోరీ. రెగ్యులర్ స్టోరీ, స్క్రీన్ ప్లే కాకుండా డిఫరెంట్ గా చేసే ప్రయత్నం చేశారు దర్శకుడు. హీరో లూజర్ నుంచి విన్నర్ గా ఎలా ఎదిగారు అనేది చాలా మలుపులతో, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో కథ… కథనాలను నడిపించారు. పిరికితనంతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ ఒంటరి కుర్రాడు… ఎలాంటి సమస్యలనైనా ఎదుర్కొనే యువకునిగా ఎలా మారాడు అనేది తెరపై ఆసక్తికరంగా ఉంటుంది. రాటుదేలిన యువకునిగా ఎదిగే క్రమంలో వచ్చే కథ… కథనాల్లో టాస్కులు ప్రేక్షకులని ఆకట్టుకుంటాయి. డైరెక్టర్ దయానంద్ హీరో తమ్ముడు కావడంతో స్క్రిప్ట్ విషయంలో ఇద్దరూ చాలా జాగ్రత్తలు తీసుకుని… చాలా కన్వినెన్సింగ్ గా టాస్కులను డిజైన్ చేసుకున్నారు. అన్నదమ్ములిద్దరూ కలిసి చాలా షార్ట్ ఫిలిమ్స్ చేయడంతో ఆ అనుభవం ఈ సినిమాకు చాలా వరకు హెల్ప్ అయిందనే చెప్పొచ్చు. ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉండటంతో… వెండితెరపైనా వాళ్లిద్దరూ ఈ సినిమాతో మెరుపులే మెరిపించారు. రియల్ టైం సైకలాజికల్ గా సాగే ఈ సినిమాతో ప్రేక్షకులను గేమ్ వరల్డ్ లోకి తీసుకెళ్ళిపోయారు. యాక్షన్ సీక్వెన్సెస్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి. ఫస్ట్ హాఫ్ నుంచే… చివరి దాకా వచ్చే టాస్కులన్నీ చాలా ఎగ్జైటింగ్ గా ఉంటాయి. ఎక్కడా బోర్ లేకుండా సినిమాని రెండు గంటల పాటు ఎంజాయ్ చేసేయొచ్చు.
నేహా సోలంకి హీరో లవర్ గా, మరోవైపు విలన్ గ్యాంగ్ తో చేతులు కలిపే టామ్ బాయ్ గా రెండు షేడ్స్ లో బాగా ఆకట్టుకుంటుంది. వీరిద్దరి మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా కుదిరింది. ఆమె కూడా ఇందులో కీ రోల్ లో కనిపించడం విశేషం. సీనియర్ ఆర్టిస్టులు మధుబాల హీరో తల్లి పాత్రలో ఆకట్టుకుంటుంది. ఎప్పటి లాగే తన సహజనటనతో భావోద్వేగాలను పండించింది. తాతయ్య పాత్రలో శుభలేఖ సుధాకర్ కాసేపు ఉన్నా… సెంటిమెంటును బాగా పండించాడు. గ్రేషేడ్స్ ఉన్న సికియాట్రిస్ట్ డాక్టర్ మదన్ పాత్రలో… ఆదిత్య మీనన్ ఎప్పటిలాగే తన నటనతో మెప్పించారు. అతని పాత్రతో సినిమా నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు. హీరో స్నేహితుల పాత్రలో కిరీటి, వాసంతి తమ పాత్రల పరిధిమేరకు నటించి మెప్పించారు.
ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ గా ఉంటుంది. థియేటర్లో సౌండ్ పవర్ పాక్డ్ ఉంటుంది. పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ రిచ్ గా ఉంది. విజువల్స్ కూడా చాలా కొత్తగా ఉంటాయి. ఎడిటింగ్ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంది. నిర్మాత రవి కస్తూరి హీరో స్నేహితుడే కాబట్టి… ఖర్చుకు వెనుకాడకుండా సినిమాని ఎంతో క్వాలిటీగా నిర్మించారు. చివరలో గేమ్ ఆన్… సీక్వెల్ ఉంటుందనే హింట్ ఇచ్చి… వదిలేశారు దర్శకుడు. గో అండ్ వాచ్ ఇట్..!!!
రేటింగ్: 3