హాస్యనటుడిగా తెరంగేట్రం చేసిన నటుడు సుహాస్… ఆ తరువాత కలర్ ఫొటో, రైటర్ పద్మభూషణ్ లాంటి వైవిధ్యభరితమైన సినిమాలలో నటిస్తూ… తనకంటూ ఓ మంచి ప్రామిసింగ్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. కథల ఎంపికలో సినిమా… సినిమాకి సంబంధం లేకుండా ఓ రియల్ స్టిక్ ఎమోషన్స్ ఉన్న కథలతో ప్రయాణం చేస్తున్నాడు ఈ యువ నటుడు. తాజగా ఎప్పుడో జరిగిన కొన్ని రియాల్ ఇన్సి డెంట్స్ ని బేస్ చేసుకుని రాసుకున్న ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండ్’ సినిమాలో నటించారు. ఇతని సరసన శివాని అనే ఓ ఇన్ స్టా ఇన్ ఫ్ల్యూయెన్సర్ తొలిసారి నటించారు. మలయాళ నటుడు నితిన్ ప్రసన్న విలన్ పాత్రలో నటించారు. సుహాస్ అక్క పాత్రలో శరణ్య ప్రదీప్ నటించింది. ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.
కథ: అంబాజీపేటలో తన కులవృత్తి చేసుకుంటూ ఎంతో ఆత్మాభిమానంతో జీవిస్తుంటుంది మల్లి కుటుంబం(సుహాస్, శరణ్య). మల్లి అక్క పద్మ(శరణ్య ప్రదీప్) అదే ఊళ్లో స్కూల్ టీచర్ గా పనిచేస్తూ ఉంటుంది. ఆ గ్రామంలో వెంకట్(నితిన్ ప్రసన్న) కొంచెం డబ్బు, పలుకుబడి, పరపతి ఉన్న గ్రామ మోతుబరి. ఇళ్లు తాకట్టు పెట్టుకుని అధిక వడ్డీలకు డబ్బులిచ్చి… గ్రామంలోని పేదలను తన చెప్పు చేతల్లో పెట్టుకుంటూ ఉంటారు. పద్మకి, వెంకట్ కి మధ్య అక్రమ సంబంధం ఉందనే ప్రచారం మాత్రం జరుగుతూ ఉంటుంది. వెంకట్ చెల్లెలు లక్ష్మీ(హీరోయిన్ శివాని)ని మల్లీ ఇష్టపడతాడు. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమించుకుంటారు. అయితే వీరిద్దరి మధ్య, కులం, డబ్బు, పరపతి అనే అంతరం ఉంటుంది. ఇలాంటి గ్రామంలో తను ఇష్టపడిన లక్ష్మీని మల్లి పెళ్లి చేసకున్నారా? వెంకట్ కి, పద్మకి మధ్య అక్రమ సంబంధం ఉందనే జరిగే ప్రచారంలో నిజమెంత? దీనిని పద్మ ఎలా ఎదుర్కొంది? తదితర వివరాలు తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: ఇది 2007లో జరిగే కథ. గ్రామాల్లో ఎప్పటి నుంచో నెలకొన్న కులం, డబ్బు, హోదా, పరపతిలాంటి చుట్టూ రాసుకున్న కథ. ఇలాంటి కథలు పల్లెటూర్ బేస్డ్ గా గతంలో చాలా సినిమాలు చూశాం. కానీ… ఇందులో ‘ఆత్మాభిమానం’ చుట్టూ రాసుకున్న ఎమోషన్స్ హృదయాన్ని తాకుతాయి. ఆత్మాభిమానాన్ని గుండెల నిండా నింపుకున్న పద్మ పాత్రలో శరణ్యతో చేయించిన ప్రతి సన్నివేశం హైలైట్ అనే చెప్పొచ్చు. డబ్బు, పరపతి ఉండే కొంత మంది… పేదలపై ఎలా పెత్తనం చేయాలని చూస్తారు, వారి ఆగడాలకు ఏమాత్రం తలొగ్గని పద్మ పాత్రను నెరేట్ చేసిన విధానం… చాలా మంది అమ్మాయిలకు ఇన్స్ పి రేషన్ ఇస్తుంది. ఇందులో ఎక్కవ భాగం ఎమోషనల్ సీన్స్ అన్నీ పద్మ పాత్ర చుట్టూనే నడుస్తాయి. ఆత్మాభిమానాన్ని కించపరిచేలా ప్రవర్తిస్తే… ఎంతటి వాడినైనా గుండెలు పగిలేలా తన్నొచ్చు అనే దాన్ని పోలీస్ స్టేషన్ ఎపిసోడ్ లో చూపించారు దర్శకుడు. ఈ సీన్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ కి ముందు సరదా సన్నివేశాలతో ఫాస్ట్ గా సాగిపోతుంది. ఇంటర్వెల్ సీన్ తో సినిమాపై హైప్ క్రియేట్ అవుతుంది. అప్పటి నుంచి చివరి దాకా… చాలా ఎమోషనల్ గా మూవీ సాగుతుంది. ఎక్కడా బోరింగ్ లేకుండా సినిమాని ఓ హై ఇంటెన్స్ తో క్లైమాక్స్ ను ముగించారు దర్శకుడు దుశ్యంత్.
సుహాస్ ఎప్పటిలాగే తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు. పాటలకు స్టెప్పులు కూడా బాగా వేశారు. సుహాస్ అక్క పాత్రలో శరణ్య నటన అద్భుతంగా ఉంది. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుంది. విలన్ పాత్రలో నటించిన మలయాళ నటుడు నితిన్ ప్రసన్న తన రౌద్రంతో మెప్పించారు. అచ్చం గ్రామాల్లో ఉండే ఓ ఫెరోషియస్ విలేజ్ విలన్ ఎలా ఉంటారో దానికి కరెక్ట్ గా యాప్ట్ అయ్యారు. పుష్ఫ జగదీష్… ఇందులో పెద్దగా గుర్తింపులేని పాత్రలో కనిపించారు. తెలుగమ్మాయి హీరోయిన్ శివాని కూడా చాలా హోమ్లీగా కనిపించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువతులు ఎలా ఉంటారో అలా కనిపించారు. ఇక మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించారు.
దర్శకుడు దశ్యంత్… తను చూసిన కొన్ని ఇన్సి డెంట్స్ ను బేస్ చేసుకుని, సినిమాటిక్ లిబర్టీతో చేసిన ఈ సినిమాలో ఎమోషన్స్ ప్రధానం. ఇవి ఆడియన్ ని కట్టిపడేస్తాయి. అందుకు తగ్గట్టుగా రాసుకున్న సంభాషణలు హైలైట్. శరణ్యకు, క్లైమాక్స్ లో హీరోకు రాసుకున్న మాటలు బాగా పేలుతాయి. సంగీతం బాగుంది. పాటలు రెండు బాగున్నాయి. నేపథ్యం సంగీతం ఆకట్టుకుంటుంది. సినిమాటోగ్రఫీలో విలేజ్ వాతావారణాన్ని బాగా చూపించారు. ఇందులో మట్టి వాసన కనిపిస్తుంది. ఎడిటింగ్ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంది. ఈ చిత్రాన్ని జీఏ2 పిక్చర్స్, దర్శకుడు వెంకటేష్ మహా బ్యానర్ మహాయన మోషన్ పిక్చర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా ఉన్నతంగా ఉన్నాయి. గో అండ్ వాచ్ ఇట్…!!!
రేటింగ్: 3.25