యష్ పూరి, అపూర్వ రావ్ జంటగా నటించిన చిత్రం హ్యాపీ ఎండింగ్. గతంలో .చెప్పాలని ఉంది, అలాంటి సిత్రాలు, శాకుంతలం సినిమాలలో నటించి మంచి గుర్తంపు తెచ్చుకున్నారు. ఈ చిత్రాన్ని హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి. యోగేష్ కుమార్, సంజయ్ రెడ్డి, అనిల్ పల్లాల నిర్మాతలు. కౌశిక్ భీమిడి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది . మరి ఈ సినిమాతో యష్ పూరి ఎలాంటి పేరు తెచ్చుకున్నాడు, సినిమా ఎలా ఉందో చూద్దాం పదండి.
కథ: హర్ష్ (యష్ ) ఒక మేకప్ ఆర్టిస్ట్. అతనికి చిన్నప్పుడు ఓ బాబా (అజయ్ ఘోష్) శాపం వల్ల అమ్మాయిలను ప్రేమించడం కానీ, వారితో సన్నిహితంగా మెలగలేడు. అలాంటి యువకుని జీవితంలోకి అవని (అపూర్వ రావ్).. ప్రేమిస్తున్నా అంటూ వస్తుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటా అని హార్ష్ ను వెంటపడుతూ ఉంటుంది. మరి అవని ప్రేమను హర్ష్ అంగీకరించాడా? హర్ష్ కి వున్న శాపం ఏంటి? చివరకు అది ఎలా తొలగి పోయింది తదితర వివరాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: పురాణాల్లోని శాపాలు అనే కాన్సెప్ట్ తీసుకుని చిత్ర దర్శకుడు కౌశిక్ “హ్యాపీ ఎండింగ్” కథ, కథనాలను డెవలప్ చేశారు. పురణాల్లో మనం చదివిన శాపాలు ఇవాళ్టి తరం కుర్రాడికి వస్తే అతని జీవితంలో ఎలా మారిపోయింది. ఆ శాపాన్ని ఎదుర్కొనేందుకు ఆ యువకుడు చేసిన ప్రయత్నాలు ఏంటి అనేది… దర్శకుడు చాలా ఎంటర్ టైనింగ్ గా తెరకెక్కించారు. ఇందులో సందేశం ఇచ్చినట్లు ఉండదు. అంతా ఫన్ అండ్ ఎంటర్ టైన్ మెంట్ తో సాగుతుంది. హీరో శాపంతో ఇబ్బందులు పడినా.. ప్రేక్షకులు మాత్రం నవ్వుకుంటారు. ఫస్ట్ హాఫ్ అంతా ఎంటైర్ టైనింగ్ గా సాగి.. సెకెండ్ హాఫ్ ప్రేమ, హీరోకి వున్న శాపం క్రమంగా వెళ్లిపోవడం అంతా క్లీన్ ఎంటైర్ టైనింగ్ గా ఉంటుంది. మూడు వేల ఏళ్ల కిందటి కాన్సెప్ట్ తీసుకుని ఇప్పటి జెనరేషన్ ఆడియెన్స్ కు నచ్చేలా ఓల్డ్ అండ్ న్యూ బ్లెండ్ చేసి రూపొందించిన ఈ సినిమా… శాపమనే అంశం చుట్టూ కొంత యూత్ ఫుల్ అంశాన్ని బిగినింగ్ లో చూపించారు. కానీ సినిమాలో అడల్ట్ కంటెంట్ ఉండదు. పిల్లలు, పెద్దలు అందరు కలిసి చూడొచ్చు. ఓ న్యూ హీరోకు యంగ్ ఆడియెన్స్ ను అట్రాక్ట్ చేయాలంటే కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండాలి. ఫ్రెండ్స్ తో కలిసి ఎంజాయ్ చేసేలా కొన్ని యూత్ ఫుల్ సీన్లు కూడా ఉన్నాయి. ఇందులో పొయెటిక్, అండర్ స్టాండింగ్, స్పిరిచువల్ లవ్ ఉంటుంది. ఏదైనా విషయాన్ని ఓపెన్ గా చెబితే దాన్ని బోల్డ్ అనొచ్చు. అంతే గానీ అది ఫిజికల్ గా చూపించడం కాదు. శాపం అనేది లేకుంటే ఈ సినిమా కథ ప్రారంభం కాదు. ఒక యువకుడి ఫీలింగ్స్ బయటకు రాకుండా మనసులోనే ఉండిపోతే అతను ఎలా ఉంటాడు అనేది ఈ సినిమాలో చూపించారు.
యువ హీరో యష్ పూరి ఎప్పటి లాగే ఎంతో ఈజ్ తో నటించారు. టైటిల్ బోల్డ్ కంటెంట్ సినిమా అనేలా వున్నా… సినిమాలో మాత్రం అలాంటి ఫీలింగ్ ఏమాత్రం లేకుండా చుసే పాత్రను చేశారు. అతనికి జోడీగా నటించిన అపూర్వ రావ్ కూడా హీరో లవర్ గా.. ఓ డీసెంట్ లవర్ పాత్రలో నటించింది. కమెడియన్ విష్ణు… హీరో ఫ్రెండ్ పాత్రలో నటించి నవ్వించారు. బాబా పాత్రలో అజయ్ ఘోష్ ఆకట్టుకున్నాడు. అతని భార్యగా ఝాన్సీ నటించి మెప్పించారు. మిగతా పాత్రలన్నీ తమ తమ పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు.
ఓ కొత్త కథని చాలా ఎంటర్ టైన్మెంట్ వేలో చెప్పాడు దర్శకుడు. ఇలాంటి కథలను టచ్ చేయాలంటే కొంత సాహసమే అవుతుంది. సంగీతం పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. హీరో, హీరోయిన్ జంటని చాలా అందంగా చూపించారు. ఎడిటింగ్ ఇంకాస్త క్రిస్పీగా వుండాల్సింది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.
గో అండ్ వాచ్ ఇట్…!!!
రేటింగ్: 2.75