యువ సంగీత దర్శకుడు అటు సంగీత దర్శకునిగా.. ఇటు హీరోగానూ రాణిస్తూ తెలుగు, తమిళ భాషల్లో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు నిర్మాతగా కింగ్ స్టన్ మూవీతో మారిపోయాడు. తానే నటిస్తూ నిర్మించాడు. నిర్మాతగా, హీరోగా, సంగీత దర్శకుడిగా చేసిన ఈ చిత్రంలో హిరోయిన్ గా దివ్య భారతి నటించారు. తెలుగు, తమిళం భాషల్లో మంచి హైప్‌తో ఈ మూవీ ఈరోజు రిలీజ్ అయింది. మరి ఎలా వుందో రివ్యులో తెలుసుకుందాం పదండి.
కథ: కింగ్ (జీవీ ప్రకాష్) తుతువూరు ప్రాంతానికి చెందిన వాడు. తుతువూరు ప్రాంతానికి సముద్ర శాపం ఉంటుంది. ఆ ఊరి వాళ్లు ఎవరు సముద్రంలోకి వెళ్లినా తిరిగి శవంగానే బయటకు వస్తారు. అయితే ఈ కారణంగా ఆ ఊరికి ఉపాధి ఉండదు. దీంతో ఆంటోని (సబూమన్) గుప్పిట్లోకి వెళ్తాడు కింగ్. అతడి వద్దే పని చేస్తుంటాడు. అక్కడ ఆంటోని చేసే పనులు నచ్చక ఓ టైంలో కింగ్ ఎదురు తిరుగుతాడు. దీంతో కింగ్‌తో పాటు, అతని ఊరి మొత్తానికి పని లేకుండా పోతుంది. అసలు తన ఊరికి ఉన్న శాపం ఏంటి? శాపం వెనుకున్న కారణాలు ఏంటి? సముద్రంలోకి వెళ్లిన వాళ్లు ఎందుకు మరణిస్తున్నారు? అనే విషయాల్ని తెలుసుకోవాలంటే సినిమాచూడాల్సిందే.
కథ… కథనం విశ్లేషణ: తమిళంలో ఇలాంటి ప్లాట్ తో తెరకెక్కిన మూవీని తెలుగులోకి అనువదించి తేవడం కథలో బలం ఉండబట్టే. వైవిద్యమైన కథలకి బ్రహ్మరథం పట్టే తెలుగు ఆడియెన్స్…. ఈ కాన్స్పెట్ ను కూడా ఆదరిస్తారనే నమ్మకంతో విడుదల చేయటం అభినందనీయం. సముద్ర శాపంతో కొట్టుమిట్టాడే ఓ ఊరి ప్రాంతం.. ఉపాధి లేక అల్లాడిపోతోన్న జనం.. ఆ ఊరి జనం కోసం నిలబడే హీరో… మాస్ ఎలివేషన్స్ తో వెండి తెరపై హీరో కనిపిస్తే బీసీ సెంటర్లలో విజిల్స్ పడాల్సిందే. మాస్ ఆడియెన్స్ ను మెప్పించేందుకు కావాల్సిన ఎలివేషన్స్, ఎమోషన్స్ అన్నీ పర్ ఫెక్ట్ గా కుదిరాయి. హీరో.. విలన్ వద్దే పనిచేస్తూ… అతనికే ధమ్కీ ఇవ్వాలంటే హీరోకి కావాల్సినంత మాస్ అప్పియరెన్స్ వుండాలి. అప్పుడే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఇలాంటి వాటిని దర్శకుడు బాగా సెట్ చేశాడు. లాజిక్స్ అన్నీ పక్కన పెట్టి సినిమాను చూస్తే… బాగా ఎంగేజ్ చేస్తుంది మూవీ. సినిమా ఫస్ట్ హాఫ్ కొంత తమిళ నేటివిటీతో కాస్త స్లో కావడం ప్రేక్షకుల్ని నిరాశ కలిగించినా…. సెకండ్ హాఫ్ బాగా ఆకట్టుకుంటుంది.
జీవీ ప్రకాష్‌కు ఇలాంటి రా అండ్ రస్టిక్ పాత్రలు ఈజీగా చేసేస్తుంటాడు. పాత్రకు తగ్గట్టుగా మేకోవర్ కూడా అవుతాడు. ఈ చిత్రంలో జీవీ ప్రకాష్ యాక్టింగ్, లుక్స్ అన్నీ కూడా మాస్ సినిమాలో ఎలా ఉంటాయో.. అలానే ఉంటాయి. యాక్షన్ సీక్వెన్స్‌లోనూ జీవీ మెప్పిస్తాడు. ఇక దివ్య భారతికి స్క్రీన్ స్పేస్ తక్కువే.. ఇంపార్టెన్స్ కూడా తక్కువే. ఆంటోని పాత్ర సెకండాఫ్ లో తేలిపోయింది. సాల్మాన్, బోస్, చార్లెస్ ఇలా చాలా పాత్రలకు మంచి ప్రాముఖ్యత ఉంది. హీరో ఫ్రెండ్ గ్యాంగ్ కూడా మెప్పిస్తుంది. ఇలా అన్ని పాత్రలు ఓకే అనిపిస్తాయి.
సాంకేతికంగా ఈ సినిమా మెప్పిస్తుంది..విజువల్స్, కెమెరా వర్క్, బిజీమ్ ఆకట్టుకుంటాయి. సెకండాఫ్ మొత్తం వీఎఫ్ఎక్స్ బాగుంది. పడవ, సముద్రం, అక్కడ చూపించిన సీన్లు బాగుంటాయి. ఇక కెమెరా మెన్ తన షాట్స్, యాంగిల్స్‌తోనే భయపెట్టేస్తాడు. ఆర్ఆర్‌తోనూ ఆడియెన్స్ భయపడిపోతారు. అలా టెక్నికల్‌గా కింగ్ స్టన్ మూవీ బాగా ఆకట్టుకుంటుంది.
రేటింగ్: 3