హీరోయిన్లు సోలో పాత్ర పోషించిన సినిమాలు ఇంట్రెస్టింగ్ గా వుంటాయి. అందులోనూ బోల్డ్ డైలాగులు చెబితే… అలాంటి సినిమాలపై ప్రేక్షకులకు మరింత ఆసక్తి వుంటుంది. ఇటీవల ‘శివంగి’ చిత్రంలో యంగ్ హీరోయిన్ ఆనంది చెప్పిన బోల్డ్ డైలాగులు ఆడియన్స్ ను విపరీతంగా అటెన్షన్ చేశాయి. టీజర్, ట్రైలర్లతో మార్కెట్లో మంచి బజ్ ను క్రియేట్ చేసుకున్న ఈ చిత్రానికి దర్శకత్వం దేవరాజ్ భరణి ధరన్ వహించారు. ఫస్ట్ కాపీ మూవీస్ పతాకంపై పంచుమర్తి నరేష్ బాబు నిర్మించారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ ఓ పవర్ఫుల్ పాత్రలో నటించారు. ఇతర పాత్రల్లో జాన్ విజయ్, కోయ కిశోర్ తదితరులు నటించారు. ఈ చిత్రం ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ చిత్రం ఎలావుందో చూద్దాం పదండి.
స్టోరీ లైన్… ఓ వైపు తన భర్త అనారోగ్య పరిస్థితులు… మరో వైపు ఆర్థిక సమస్యలు సత్యభామ(ఆనంది)ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. దానికి తోడు తన అత్త నుంచి ఎదురయ్యే వేధింపులు… అలాగే తనను కంటికి రెప్పలా కాపాడుకునే తల్లిదండ్రులు వరదల్లో చిక్కుకు పోవడం… ఇలా కష్టాలన్నీ సత్యభామను అష్టదిగ్భంధనం చేయడంతో సత్యభామకు ఊహించని ఉపద్రవాలు ఎదురవుతాయి. దాంతో ఆమె పోలీసులను ఆశ్రయిస్తుంది. సత్యభామ పోలీసులను ఆశ్రయించడానికి గల కారణాలు ఏమిటి? ఎవరైనా హత్యకు గానీ, ఆత్మహత్యకు గానీ గురయ్యారా? సత్యభామ సమస్యలకు పరిష్కారం దొరికిందా? తదితర వివరాలు తెలియాలంటే ‘శివంగి’ సినిమా చూడాల్సిందే.
సినిమా ఎలావుందంటే…
సత్యభామగా చిత్రంలో ప్రముఖ పాత్ర పోషించిన ఆనంది నటన మనం గతంలోనే ఎన్నో చిత్రాలలో చూశాము. అదేవిధంగా ఈ చిత్రంలో కూడా తనదైన మార్క్ సృష్టిస్తూ ఆనంది తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకున్నారు. చిత్రం అంతా తానే కనిపిస్తూ ప్రేక్షకులు ఎక్కడా బోర్ కొట్టకుండా తనదైన శైలిలో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ఎక్కడా గ్లామర్ షో లేకుండా… కేవలం రెండు చీరలలో మాత్రమే సినిమా అంతా కనిపిస్తూ… తన పవర్ ఫుల్ డైలాగ్స్ తో ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. పోలీస్ రోల్ లో గతంలో ఎన్నో చిత్రాలలో నటించినప్పటికీ, ఈ చిత్రంలో తెలంగాణ యాసతో వరలక్ష్మి శరత్ కుమార్ తనలో మరో యాంగిల్ యాక్టింగ్ స్టైల్ ఉందని నిరూపించుకున్నారు. అదేవిధంగా చిత్రంలో నటించిన జాన్ విజయ్, కోయా కిషోర్ స్క్రీన్ టైమ్ తక్కువగా ఉన్నప్పటికీ తమ మార్క్ కనిపించేలా నటించి మెప్పించారు.
దేవరాజ్ భరణి ధరన్ రచన ఇంకా దర్శకత్వంలో ఎంత జాగ్రత్తలు తీసుకున్నాడు అనేది మీ చిత్రం చూస్తే చాలా క్లియర్ గా అర్థమవుతుంది. స్క్రీన్ మీద ఎక్కువగా ఒకటే వ్యక్తి కనిపిస్తున్నప్పుడు ఆడియన్స్ సాధారణంగా బోర్ ఫీల్ అవుతారు. కానీ ఈ సినిమా చూస్తున్నంతసేపు ప్రేక్షకులు ఎక్కడా కూడా బోర్ ఫీల్ అయ్యే అవసరం రాదు. ఎంతో ఇంటెన్సిఫైడ్ గా కథ ముందుకు సాగుతూ ఉంటుంది. అసలు జరిగేది నిజమా కాదా అనే ఒక డౌట్ తో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఎంతో ఆసక్తిగా చూసే విధంగా స్క్రీన్ ప్లే వచ్చేలా రాసుకున్నాడు దర్శకుడు. సింగిల్ లోకేషన్ లో… క్వాలిటీలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు. సినిమా మొత్తం సింగిల్ లొకేషన్ లో చిత్రీకరణ చేసినప్పుడు ఆర్ట్ వర్క్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే బ్యాగ్రౌండ్ యాంబియన్స్ ను సెట్ చేసుకున్నాడు కళాదర్శకుడు రఘు కులకర్ణి. అలాగే ఆడియన్స్ ను ఎంగేజ్ చేసే బ్యాగ్రౌండ్ స్కోర్ అందించాడు సంగీత దర్శకుడు. చిత్రంలో ఎక్కడ కూడా వల్గారిటీ లేదా డబుల్ మీనింగ్ డైలాగులు లేకుండా, చాలా డీసెంట్ గా కుటుంబ సమేతంగా వెళ్లి చూసే విధంగా సినిమాను తెరకెక్కించారు. ఒక మహిళకు అనేక సమస్యలు ఒకే సమయంలో వచ్చినప్పటికీ ఆమె ఆ సమస్యలను మొక్కవోని ధైర్యంతో… ఆత్మస్థైర్యం కోల్పోకుండా ఎలా నిలబడ్డారు అనేది నేటి మహిళలకు మెసేజ్ ఇచ్చేలా సినిమా వుంది. ప్రపంచ మహిళాదినోత్సవం సందర్భంగా మహిళా ప్రేక్షకులకు మంచి ఇన్స్ పిరేషన్ ఇచ్చే సినిమా ‘శివంగి’. గో అండ్ వాచ్ ఇట్..
రేటింగ్ : 3.25